ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinivasa Varma: సీఎం చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పరుగులు..

ABN, Publish Date - Aug 04 , 2024 | 01:20 PM

కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Bhupathiraju Srinivasa Varma) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో కేంద్రమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు.

Union Minister Bhupathiraju Srinivasa varma

తిరుపతి: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasa Varma) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో కేంద్రమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని కేంద్ర మంత్రి చెప్పారు. గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రం వెన్నకి పోయిందని ఆయన మండిపడ్డారు. జగన్ అనే గ్రహణం కారణంగా ఏపీలో దేవాలయాలను కూడా ఎవ్వరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని శ్రీనివాసవర్మ చెప్పారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన బడ్జెట్‌లోనూ ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. అమరావతి అభివృద్ధికి రూ.15వేల కేటాయించారని, ఇచ్చిన హామీ మేరకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ఏపీ కష్టాలు మరిన్ని తీరనున్నాయని వెల్లడించారు. వైసీపీ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలతోపాటు కొత్త పరిశ్రమలను సైతం ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రకటించారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Buddha Venkanna: వల్లభనేని వంశీ ఎక్కడ కనిపించినా పోలీసులకు పట్టించండి..

SBI Robbery: ఆ జిల్లాలో ఎస్‌బీఐకు షాక్ ఇస్తున్న దొంగలు..

Updated Date - Aug 04 , 2024 | 01:21 PM

Advertising
Advertising
<