ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : సాగు.. కొత్త పుంతలు!

ABN, Publish Date - Dec 14 , 2024 | 03:27 AM

వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నూతన సాంకేతికతను జోడించి, సేంద్రియ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులిచ్చే వైవిధ్యమైన పంటలను సాగు చేసి..

  • రైతన్నకు సుస్థిర ఆదాయమే లక్ష్యం

  • రైతు కుటుంబాల జీవన ప్రమాణాలమెరుగుదలే లక్ష్యంగా విజన్‌ డాక్యుమెంట్‌

అమరావతి, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు నూతన సాంకేతికతను జోడించి, సేంద్రియ పద్ధతులను అనుసరించి, అధిక దిగుబడులిచ్చే వైవిధ్యమైన పంటలను సాగు చేసి.. మార్కెట్ల అనుసంధానంతో రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చే దిశగా స్వర్ణాంధ్ర-2047 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించారు. రైతు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్‌ కోసం రూపొందించిన 2024-47 రోడ్‌ మ్యాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న సాగు రంగానికి ఆధునిక సాంకేతికతను జోడించి, గ్లోబల్‌ అగ్రి హబ్‌గా నిలపడం దీని లక్ష్యం. ఆహార భధ్రత, పర్యావరణ అనుకూలత, అధిక ఉత్పాదన, అధిక విలువ, మార్కెట్‌ అనుసంధానాలు, నాణ్యత పెంపుదలకు ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించడం.. రైతుకు రుణ పరపతిలో చట్ట ప్రకారం మద్దతివ్వడం.. భూసారాన్ని పరిరక్షించడం.. పంట ఉత్పత్తిలో స్థిరత్వం ఉండేలా పంట మార్పిడి ద్వారా తక్కువ ఇన్‌పుట్స్‌తో సాగు చేసే పద్ధతులపై అవగాహన పెంచడం.. ముఖ్యంగా ప్రకృతి సాగును ప్రోత్సహించడం.. డ్రోన్‌ ఆధారిత అప్లికేషన్లు, రోబోటిక్స్‌, శాటిలైట్‌ టెక్నాలజీ వినియోగం, రియల్‌ టైమ్‌లో పంటల స్థితిగతులను కచ్చితత్వంతో తెలుసుకోవడం, తెగుళ్లను గుర్తించి, పరిష్కార మార్గాలు సూచించే సాంకేతికతను వినియోగించడం.. సూక్ష్మనీటి వనరుల సద్వినియోగం ఈ విజన్‌ డాక్యుమెంట్‌లోని కీలక అంశాలు.


  • 2024-47 రోడ్‌మ్యాప్‌..

  1. పంటల సాగుతో పాటు పశువుల పెంపకం.

  2. చిన్న రైతులు 100%, మధ్యస్థ రైతులు 40% ప్రకృతి వ్యవసాయం చేయడం. రైతు ఆదాయానికి తోడ్పడే అధిక దిగుబడినిచ్చే రకాల వినియోగం.

  3. పంటకోత, శుద్ధి యంత్ర సదుపాయాలు అందుబాటులోకి తేవడం.

  4. సాగుపై ఆసక్తి ఉన్న యువతకు నైపుణ్య శిక్షణ. అగ్రి టెక్‌ స్టార్ట్‌పలను ప్రోత్సహించడానికి నిర్దిష్ట విధానం.

  5. ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ లెవల్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు.

  6. ఫిష్‌ ఫార్మర్‌ పొడ్యూస్‌ ఆర్గనైజేషన్లకు ప్రోత్సాహం.

  7. మహిళా పాడి రైతులతో డెయిరీల ఏర్పాటు.

  8. సముద్రపు ఆహార ఉత్పత్తుల కోసం మెరైన్‌ స్టీవార్డ్‌షిప్‌ కౌన్సిల్‌(ఎంఎ్‌ససీ). రైతుకు సమగ్ర సాధనంగా ఉపయోగపడేలా సీఎంయాప్‌ మెరుగుదల

  9. పంట వ్యర్ధాల నుంచి సంపద అవకాశాల అభివృద్ధి. సేంద్రియ ఎరువులుగా పశువుల విసర్జిత పదార్థాలు.

  10. ప్రతి జిల్లాలో ఓడరేవులు, ఫుడ్‌ పార్కులు, అగ్రి ఎక్స్‌పోర్ట్‌ జోన్‌ల అభివృద్ధి.

Updated Date - Dec 14 , 2024 | 03:27 AM