Jagan: కాకినాడలో పర్యటించనున్న సీఎం జగన్
ABN , Publish Date - Jan 03 , 2024 | 10:23 AM
నేడు సీఎం జగన్ కాకినాడలో పర్యటించనున్నారు. వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

కాకినాడ: నేడు సీఎం జగన్ కాకినాడలో పర్యటించనున్నారు. వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీకి హాజరు కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీగా జనాలను అధికారులు తరలిస్తున్నారు. సీఎం సభకు రాకపోతే పెరిగిన పెన్షన్ డబ్బులు ఇవ్వమని వాలంటీర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఐదు జిల్లాల నుంచి 318 బస్సులను అధికారులు తరలిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.