ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sajjala Ramakrishna Reddy: పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు.. సజ్జలపై క్రిమినల్ కేస్..

ABN, Publish Date - May 31 , 2024 | 08:36 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదైంది. టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సజ్జలపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా సజ్జల చేసిన వ్యాఖ్యలపై లక్ష్మీనారాయణ, టీడీపీ నేతలు నిన్న ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. రూల్స్ పాటించే వారు కౌంటింగ్‌కు అక్కరలేదని, వాదించే వారు మాత్రమే వెళ్ళాలని రామకృష్ణా రెడ్డి చెప్పారు. సజ్జలపై ఐపీసీ లోని u/s 153,505 (2) IPC, 125 RPA 1951 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు న్యాయవాది లక్ష్మీనారాయణకు పోలీసులు సమాచారం ఇచ్చారు.  

జగన్‌ కక్ష ఏబీవీకి ఐదేళ్ల శిక్ష


పోల్ మేనేజ్ మెంట్ తరహాలోనే కౌంటింగ్ డే మేనేజ్ మెంట్ కూడా చేయగలిగితేనే ఎన్నికల్లో తమకు గెలుపు సాధ్యమని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ ఏజెంట్లకు తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ మేనేజ్‌మెంట్ క్లాస్ తీసుకున్నారు. రూల్స్ అంటూ మడి కట్టుకుని కూర్చొని ఏ ఒక్క ఓటునూ వదిలేయొద్దని.. వైసీపీ టార్గెట్ ఏంటో తెలుసుకుని కౌంటింగ్ రోజు పని చేయాలన్నారు. అవసరమైతే రూల్స్ దాటి అయినా పనిచేయాలని సూచించారు. రూల్స్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని, ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ లేకుండా చేయాలని సూచించారు. ప్రతీ కౌంటింగ్ ఏజెంట్‌కు ఈ విషయాలన్నీ క్లియర్‌గా అర్థమయ్యేలా చెప్పాలని ఛీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకు సజ్జల తెలిపారు.

భోగాపురం భూములు.. భోంచేశారు!

Read more AP News and Telugu News

Updated Date - May 31 , 2024 | 08:36 AM

Advertising
Advertising