AP Politics: రేపు వైఎస్ షర్మిలతో సీపీఐ రామకృష్ణ, సీపీఎం శ్రీనివాస రావు భేటీ
ABN, Publish Date - Feb 22 , 2024 | 09:32 PM
కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు సమావేశమై చర్చిస్తారు. వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహం గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల హీట్ నెలకొంది. మరో 2, 3 నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. అధికార వైసీపీపై (YCP) విపక్షాలు మూకుమ్మడి దాడికి దిగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన (Janasena) పార్టీలు కలిసి తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ నేతలు కూడా తమ స్వరం పెంచారు. కాంగ్రెస్ పార్టీలో షర్మిల (Sharmila) చేరడంతో ఆ పార్టీకి హైప్ పెరిగింది. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మెగా డీఎస్సీ వేయాలని ఈ రోజు సచివాలయ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. షర్మిలకు కమ్యూనిస్టులు అండగా నిలుస్తున్నారు.
వైఎస్ షర్మిల గురువారం చేపట్టిన ఆందోళనలో సీపీఐ రామకృష్ణ పాల్గొన్నారు. వైఎస్ షర్మిల వెంట ఉంటామని కమ్యూనిస్ట్ నేతలు స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు గురించి వైఎస్ షర్మిలతో శుక్రవారం నాడు సీపీఐ నేత రామకృష్ణ, సీపీఎం నేత శ్రీనివాస రావు చర్చిస్తారు. రాష్ట్రంలో వైసీపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యుహాల గురించి డిస్కష్ చేసే అవకాశం ఉంది. మేనిఫెస్టోలో ఏయే అంశాలు పొందుపరచాలి..? జనాలను ఎలా ఆకట్టుకోవాలనే అంశంపై వారి మధ్య చర్చ జరిగేందుకు ఆస్కారం ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 22 , 2024 | 09:32 PM