ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆడిటర్‌ను అడ్డంగా వాడేశారు

ABN, Publish Date - Nov 19 , 2024 | 05:37 AM

చంద్రబాబు ప్రభుత్వం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ద్వారా(సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలె న్స్‌ ప్రాజెక్టు).. 2016-19 కాలంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది.

  • బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర.. జగన్‌ ఆదేశించారు.. ఆడిట్‌ సంస్థ పాటించింది

  • విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు.. ఐసీఏఐకి తాజాగా ఆ సంస్థపై ఫిర్యాదు

  • స్కిల్‌ మేలు, కనిపిస్తున్న సెంటర్లు, టెక్నాలజీ.. ఏదీ పరిశీలన చేయొద్దంటూ హుకుం

  • ఆడిట్‌ సంస్థకు షరతులు పెట్టిన జగన్‌.. ఆయన కోరుకున్నట్టే నివేదిక చేతికి

  • ఇది జరిగిన ఏడాది తర్వాత నిజం వెలుగులోకి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

చంద్రబాబు ప్రభుత్వం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు ద్వారా(సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలె న్స్‌ ప్రాజెక్టు).. 2016-19 కాలంలో 4 లక్షల మంది నిరుద్యోగ యువత, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చింది. ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఇతర కాలేజీల్లో రూ.వందల కోట్ల విలువైన మౌలిక సదుపాయా లు, ల్యాబ్‌లు, శిక్షణాకేంద్రాలు నెలకొల్పారు. 1.82 లక్షలమందికి ఉద్యోగాలు లభించాయు. అయితే, దీనిలో రూ.241 కోట్ల నిధులు చేతులు మారి సూట్‌కేసు కంపెనీలకు వెళ్లాయని, దీనికి నాటి సీఎం చంద్రబాబే ప్రధాన కారకులని గత జగన్‌ ప్రభుత్వం నిరూపించాలనుకుంది. శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ అనే కంపెనీకి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ విచారణ బాధ్యతను అప్పగించింది. విచారణపై జగన్‌ సర్కారు ఆనాడు ఓ కీలక షరతు విధించింది.

అదేమంటే, స్కిల్‌ ప్రాజెక్టులో భాగంగా ఇంజనీరింగ్‌, వృత్తివిద్యా కాలేజీల్లో నెలకొల్పిన కంప్యూటర్‌ ల్యాబ్‌లు, కొనుగోలు చేసిన సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణా కేంద్రాలు పరిశీలన చేయవద్దనేది ఆ షరతు. సహజంగా ఓ ప్రాజెక్టు అమలైందా? లేదా దోపిడి జరిగిందా? అన్నది తెలియాలంటే, ముందుగా ఆ ప్రాజెక్టు పేరిట ఎంత ఖర్చుచేశారు? వాటి ఫలితాలు ఎక్కడున్నాయి? వాటి భవిష్యత్తు ఏమిటో నిగ్గుతేల్చాలి. కానీ జగన్‌ సర్కారు ఇలాంటి వాటినే కన్నెత్తి చూడొద్దని చెప్పింది. అంటే ప్రాజెక్టులో 75 శాతం కీలకమైన అం శాన్నే విచారణ పరిధి నుంచి తప్పించింది. ఇది జగన్‌ కుట్రలోని మొదటి కోణం. జగన్‌ అనుకూల లక్ష్యాలను ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో తేల్చారు.


  • శరత్‌ అసోసియేట్స్‌పై ఐసీఏఐకి ఫిర్యాదు

వాస్తవాలను, వాటిని ధ్రువపరిచే డాక్యుమెంట్లను పరిశీలన చేయకుండా, తాము ఇచ్చిన స్టేట్‌మెంట్లను కన్నెత్తి చూడకుండా, ఏకపక్షంగా అసత్యాలు, పచ్చిఅబద్ధాలు, అర్థం లేని ఆరోపణలతో శరత్‌ అండ్‌ అసోసియేట్స్‌ సంస్థ అడ్డగోలు విచారణ నివేదిక ఇచ్చిందని, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజైన్‌టెక్‌ అనే కంపెనీ.. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియాకు(ఐసీఏఐ) ఫిర్యాదు చేసింది. మరోసారి ఇలాంటి తప్పుడు నివేదికలు ఇవ్వకుం డా సీఏ నుంచి శాశ్వతంగా తొలగించాలని కోరింది. ఈ ఫిర్యాదులోని కీలక అంశాలను పరిశీలిస్తే, స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టులో నిధులు దారి మళ్లాయనే విషయం చెప్పడానికి ‘శరత్‌ అసొసియేట్స్‌’ ఎంతగా ఆరాటపడిందో స్పష్టమవుతోంది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో ‘శరత్‌ అసోసియేట్స్‌’ లేవనెత్తినవి పచ్చి అబద్ధాలు అని చెబుతూ డిజైన్‌టెక్‌ కొన్ని అంశాలను ప్రస్తావించింది.


  • ఆ సంస్థ అబద్ధాలే చెప్పింది: డిజైన్‌ టెక్‌

1. కీలకమైన సాఫ్ట్‌వేర్‌ను సిస్టమ్స్‌లో ఇన్‌స్టాల్‌ చేయలేదని, అనేక సాఫ్ట్‌వేర్‌లకు అసలైన కీ(కంపెనీ ఇచ్చేది) లైసెన్సు ఇవ్వలేదని, సాంకేతిక విద్యలోని బోధకులు ఇచ్చిన ఇన్వెంటరీలో ఉందని.. విచారణ సంస్థ శరత్‌ అసోసియేట్స్‌ తన నివేదికలో పేర్కొంది. ఇది పచ్చి అబద్ధమని డిజైన్‌టెక్‌ పేర్కొంది. తాము అన్ని సాఫ్ట్‌వేర్‌లు ఇన్‌స్టాల్‌ చేశామని, వాటికి కీ, లైసెన్సులతో కూడిన ఎక్సెల్‌షీట్‌ను కూడా సమర్పించామని తెలిపింది. నిజానికి, స్కిల్‌డెవల్‌పమెంట్‌ శిక్షణా కేంద్రాలను విచారణసంస్థ భౌతిక పరిశీలన చేసి ఉంటే ఈ విషయంలో స్పష్టత వచ్చి ఉండేది.

2.‘‘370.78 కోట్ల వ్యయంలో డిజైన్‌టెక్‌ రెండేళ్లపాటు శిక్షణా కేంద్రాల నిర్వహణ, సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టలేషన్‌, ఇతర పనులకోసం 100 కోట్లు తీసుకుంది. కానీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్లేవీ అందుబాటులో లేవు. ఆ సంస్థ అందించలేదు. డిజైన్‌టెక్‌ ఎక్కడ? ఎంత ఖర్చుపెట్టిందో తెలిపే వివరాలే ఇవ్వలేదు’’ అని శరత్‌ అసోసియేట్స్‌ పేర్కొంది. ఇది పూర్తిగా అబద్ధమని డిజైన్‌టెక్‌ స్పష్టం చేసింది. తాము శరత్‌ అసొసియేట్స్‌కు వీటిని ఇచ్చామని తెలిపింది. ఆర్ధిక లావాదేవీల డాక్యుమెంట్లు అన్నీ తమ ఆఫీసులో ఉన్నాయని, కానీ విచారణ సంస్థ తమ ఆఫీసుకు కూడా రాలేదని పేర్కొంది.

3.‘‘సీమెన్స్‌, డిజైన్‌టెక్‌లు 241.78 కోట్ల నిధులను షెల్‌ కంపెనీలకు దారిమళ్లించినట్లు ప్రాఽథమికంగా వెల్లడవుతోంది. ఎలాంటి సేవలు అందించకున్నా స్కిల్లర్‌ ఎంటర్‌ప్రైజె్‌సకు నిధలు మళ్లించినట్లుగా ఉంది’’ అని శరత్‌ అసోసియేట్స్‌ తన నివేదికలో పేర్కొంది. దీన్ని డిజైన్‌టెక్‌ ఖండించింది. స్కిల్లర్స్‌ సంస్థ అన్ని రకాల సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లు కొనుగోలుచేసి సరఫరా చేసిందని, అందుకు సంబంధించిన బిల్లులను సమర్పించిందని గుర్తుచేశారు. పక్కా ఆధారాలు సమర్పించిన సంస్థ షెల్‌కంపెనీ ఎలా అవుతుందని డిజైన్‌టెక్‌ ప్రశ్నించింది.


  • కుట్రకోణం స్పష్టం

ఫొరెన్సిక్‌ ఆడిట్‌ నివేదిక ఇచ్చిన శరత్‌ అసోసియేట్స్‌పై డిజైన్‌టెక్‌ కంపెనీ ఐసీఏఐకి ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టాలి. ఎందుకంటే, ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో ఎలాంటి తప్పులు ఉన్నాయో డిజైన్‌టెక్‌ సవివరంగా తెలిపింది. ఏవో ఒకటో,రెండో కాదు.....ఏకంగా 14 కీలకాంశాల్లో మొత్తం ప్రాజెక్టు భవితవ్యాన్ని, దాన్ని చేపట్టిన తమ కంపెనీ భవిష్యత్తును దెబ్బతీసేలా నివేదిక ఇచ్చిందని, కాబట్టి ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిజైన్‌టెక్‌ కోరుతోంది. ఈ ఫిర్యాదును సాంతం పరిశీలన చేస్తే, జగన్‌ సర్కారు....చంద్రబాబును జైలుకు పంపించే కుట్ర అమలుకోసం చివరకు ఆడిటర్‌ సంస్థను కూడా అడ్డంగా వాడుసుకున్నట్లుగా స్పష్టమవుతోంది.

ఫోరెన్సిక్‌ ఆడిట్‌ సంస్థ ఎంపిక కోసం రూపొందించిన టెండర్‌ డాక్యుమెంట్‌లో శిక్షణా కేంద్రాలు, ల్యాబ్‌లు, కంప్యూటర్‌ సెంటర్ల భౌతిక పరిశీలన అనే అంశం ఉంది. ఆ తర్వాత జరిగిన ప్రీబిడ్‌ మీటింగ్‌లో ఆ అంశాన్ని ఆర్‌ఎ్‌ఫపీ నుంచి తొలగించడం ద్వారా సర్కారు తన అసలు ఉద్దేశాలను బయటపెట్టుకుంది. చివరకు ఆడిటర్‌ సంస్థ శరత్‌ అసోసియేట్స్‌ కూడా తన నివేదికలో భౌతిక ఆస్తులను ప్రభుత్వం పరిశీలన చేయవద్దన్న అంశాన్ని ప్రస్తావించడం గమనార్హం. నిష్పాక్షిక విచారణ జరిపించాలనుకున్న ప్రభుత్వం షరతులు విధించింది అంటేనే దాని వెనక ఉన్న కుట్రకోణం స్పష్టమవుతోందని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 05:37 AM