Breaking: జగన్, అవినాష్ రెడ్డిల నుంచి రక్షించాలన్న దస్తగిరి పిటిషన్‌పై కోర్టు కీలక ఆదేశాలు
ABN, Publish Date - Mar 28 , 2024 | 12:43 PM
తన కుటుంబ సభ్యులకు సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ దస్తగిరి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌ని నాంపల్లి కోర్టు ఆదేశించింది.
అమరావతి: తన కుటుంబ సభ్యులకు సీఎం జగన్ (CM Jagan), ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)ల నుంచి ప్రాణ రక్షణ కల్పించాలంటూ దస్తగిరి (Dastagiri) పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ జరిపి రిపోర్ట్ సమర్పించవలసిందిగా సీబీఐ (CBI)-యాంటీ కరప్షన్ జోన్ డిప్యూటీ లీగల్ అడ్వైజర్‌ని నాంపల్లి కోర్టు (Nampally Court) ఆదేశించింది. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పమని జగన్, అవినాష్ రెడ్డి అనుచరులు తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారంటూ నాంపల్లి కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశాడు.
AP Elections: రాజకీయాల్లోకి స్టార్ యాంకర్..! జనసేన, వైసీపీ తరపున ప్రచారం..
తన తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారని పోలీస్ రిపోర్టు ఇచ్చినా స్వీకరించడం లేదంటూ దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దస్తగిరి తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీబీఐ అధికారులను నాంపల్లి కోర్టు కోరింది. ఈ పిటిషన్‌పై సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా కేసులో (YS Viveka Case) అప్రూవర్‌గా మారిన దస్తగిరి (Dastagiri) తండ్రి హాజీపీరాపై గుర్తుతెలియని వ్యక్తులు కొద్ది రోజుల క్రితం వైసీపీ అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే దస్తగిరి తన కుటుంబాన్ని కాపాడాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
TDP: ఉద్యోగాలు అడిగితే గంజాయి ఇస్తున్నారు
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 28 , 2024 | 12:43 PM