Weather report: బాబోయ్.. తీరానికి తుపాన్ వచ్చేస్తోంది..!
ABN, Publish Date - May 26 , 2024 | 12:42 PM
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
Remal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. దీని ప్రభావం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలపై ఉంటుందన్నారు.
హెచ్చరికలు జారీ..
మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ రేపు మత్స్యకారులు సముద్ర తీరానికి వెళ్లొద్దని, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెమల్ తుపాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై అంతగా ఉండదన్నారు. ఉత్తరాంధ్రలో ఒకటి రెండు చోట్ల చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రేపట్నుంచి రాష్ట్రంలో పగటి ఉష్టోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు.
ఒడిశా, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కోస్ట్‌గార్డ్‌ను సైతం అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హౌరా, హుగ్లీ, తూర్పు, మిడ్నాపూర్, కోల్‌కతాలో గంటకు 70-80కి.మీ. వేగంతో గాలులు వీచనున్నట్లు తెలిపారు. తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
AP Elections: వైసీపీ నేతలు... యువతులతో అర్ధనగ్న డ్యాన్సులా? సిగ్గు సిగ్గు..!
Fire accident: గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు
Updated Date - May 26 , 2024 | 12:43 PM