Donate to AP: దాతలు తమ విరాళాలు ఇలా పంపండి..
ABN, Publish Date - Sep 03 , 2024 | 08:02 PM
ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 03: ఊహించని ఉపద్రవం వారిని ముంచెత్తింది. ఒక్కసారిగా దూసుకొచ్చిన రాకసి వరద.. నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్లకు ఇళ్లను ముంచెత్తడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కట్టుబట్టలు మినహా దిక్కులేక ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆదుకోండయ్యా అని దీనంగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే.. సాటి మనుషుగా వరద బాధితులకు మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం తనవంతు బాధితులకు భరోసా ఇస్తోంది. వరద బాధితులు భారీ స్థాయిలో ఉండటంతో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. దాతలు తమకు తోచినంత సాయం చేయాలని.. వరద బాధితులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.
వరద బాధితులకు స్వచ్ఛందంగా ఆహారం ఇవ్వదలచిన దాతల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పాయింట్ ఏర్పాటు చేశారు. సాయం చేసే దాతలు ఐఏఎస్ మనజీర్‌ను సంప్రదించాలని ప్రభుత్వం ప్రకటించింది. ఆయన నెంబర్ కూడా ప్రకటించింది. దాతలు 79067 96105 కు సంప్రదించొచ్చని తెలిపింది. ఇక వ్యక్తిగత ధన సహాయం చేయదల్చిన దాతలు ఆన్‌లైన్ ద్వారా చెల్లించొచ్చని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం ప్రభుత్వ బ్యాంక్ అకౌంట్ వివరాలను ప్రకటించింది.
దాతలు ఈ అకౌంట్‌కు నిధులు పంపొచ్చు..
SBI
A/c name : CMRF
A/c number : 38588079208
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : SBIN0018884
Union Bank of India
A/c name : CM Relief Fund
A/c number : 110310100029039
Branch: AP Secretariat, Velagapudi.
IFSC code : UBIN0830798.
Also Read:
దటీజ్ చంద్రబాబు.. కనీసం భోజనం కూడా చేయకుండా..
ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురిలో బెస్ట్ కెప్టెన్ అతడే..
అసెంబ్లీ ఎన్నికలు: పొత్తుపై సంప్రదింపులు
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Sep 03 , 2024 | 08:02 PM