ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ramakrishna: టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్న వైసీపీ

ABN, Publish Date - Apr 11 , 2024 | 09:53 PM

|పీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ (Dr. A.S. Ramakrishna) అన్నారు. గురువారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ నేతలు ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.

అమరావతి: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ (YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ (Dr. A.S. Ramakrishna) అన్నారు. గురువారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలు ఏఎస్ రామకృష్ణ, మన్నవ సుబ్బారావు, ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు.


Lokesh: కోయంబత్తూరుకు బయలుదేరిన నారా లోకేష్.. విషయం ఇదే!

ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలకు ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లుగా అవకాశం లేకుండా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో అడ్డుకున్నే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం దురద్దేశంతో, ఉద్దేశ పూర్వకంగా పథకం ప్రకారం తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని ధ్వజమెత్తారు.


గత ఎన్నికల్లో ఏజెంట్లుగా పనిచేసిన వారిని, చురుగ్గా ఉన్న నాయకులను గుర్తించి వైసీపీ నేతలు పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏజెంట్లుగా ఉండే తమ నేతలపై కేసులు ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ అధికారులు వెరిఫికేషన్ చేసే సమయంలో అనర్హులుగా ప్రకటించేలా కుట్రలు పన్నుతున్నారన్నారు.


YS Sharmila: మోసానికే బ్రాండ్ అంబాసిడర్ జగన్.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పగలరా?

పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్ల నియమాకాన్ని అడ్డుకోవద్దనే నిబంధనలున్నా పట్టించుకోవడం లేదని అన్నారు.ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల విధుల్లో కీలకంగా వ్యవహరించే అధికారుల్లో సీనియర్లను పక్కనపెట్టి తమకు అనుకూలంగా ఉన్న జూనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. దివ్యాంగులకు, గర్భిణులను ఎన్నికల విధుల్లో డ్యూటీలు వేయొద్దని సీఈఓ ఆఫీస్‌లో ఫిర్యాదు చేసినట్లు రామకృష్ణ తెలిపారు.


ఇవి కూడా చదవండి

Varla Ramaiah: ఆ ఇద్దరి చేతగానితనం వల్లే పోలీసులకు ఈ దుస్థితి

Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 10:04 PM

Advertising
Advertising