ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

MP C.M.Ramesh: నెహ్రూ తర్వాత ప్రధాని మోడీదే ఆ రికార్డు: ఎంపీ సీఎం రమేశ్

ABN, Publish Date - Jul 08 , 2024 | 09:36 PM

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో కూటమి కార్యకర్తలు ఐకమత్యంతో తమను గెలిపించినందుకు అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(MP C.M.Ramesh) కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీపడే విధంగా దేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ తీర్చిదిద్దారని ఆయన చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా మోడీ హయాంలో ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులు అభివృద్ధి చేసినట్లు చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధానిగా గెలిచిన వ్యక్తి మోడీ అని సీఎం రమేశ్ అన్నారు.


గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ జగన్ సర్వనాశనం చేశారని ఎంపీ సీఎం రమేశ్ మండిపడ్డారు. ఏపీ ప్రజలు దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విశ్వాసంతో భారీ మెజార్టీతో కూటమిని గెలిపించారని పేర్కొన్నారు. చరిత్రలో ఎక్కడా లేని విధంగా కూటమిని విజయం వైపు నడిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌లో ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎన్నికల్లో గెలవలేదని, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సైతం వచ్చే ఎన్నికల్లో గెలవరని ఎద్దేవా చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను స్వాధీనం చేసుకుంటానని ప్రధాని చెప్పారని, ఆయన చెప్పారంటే చేసి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ఆ దిశగా అడుగులు వేస్తారని ఎంపీ సీఎం రమేశ్ చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి:

Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంలో ఆ శాఖలో అవినీతిపై మంత్రి నాదెండ్ల ఆశ్చర్యం..

Updated Date - Jul 08 , 2024 | 09:36 PM

Advertising
Advertising
<