రికార్డుస్థాయిలో సత్యదేవుడి వ్రతాలు
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:10 AM
అన్నవరం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి ఆలయంలో ఈ ఏడాది కార్తీక మాస వ్రతాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఇ
కార్తీకమాసం ఒకరోజు మిగిలుండగానే 1,44,785 వ్రతాలు
అన్నవరం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): రత్నగిరివాసుడైన సత్యదేవుడి ఆలయంలో ఈ ఏడాది కార్తీక మాస వ్రతాలు రికార్డుస్థాయిలో నమోదయ్యాయి. ఇప్పటివరకు కార్తీకంలో 2022లో జరిగిన 1,42,373 వ్రతాలు రికార్డుకాగా కార్తీకం ముగియడానికి ఒకరోజు ముందైన శనివారానికి 1,44,785 వ్రతాలు జరిగినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. వీటిలో 70శాతం వ్ర తాలు రూ.300 ధరలోనివి కావడం విశేషం. ఈ ఏడాది కార్తీకమాసంలో బహుళ ఏకాదశి రోజున మాత్రమే 10,000 వ్రతాలు దాట గా మిగిలిన రోజుల్లోనూ రికార్డుస్థాయిలో వ్రతాలు జరగడం గమనించదగిన విషయం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది, వ్రత పురోహితులు చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారంతో కార్తీక మాసం ము గియనుండగా మరో 3వేల వ్రతా లు అదనంగా జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.