శెట్టిబలిజ కుల ధ్రువపత్రాల మంజూరులో సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 04 , 2024 | 12:18 AM
శెట్టిబలిజ కుల ధ్రువపత్రాల మంజూరులో సమస్యలు పరిష్కరించాలి

మామిడికుదురు, మార్చి 3: శెట్టిబలిజ కుల ధ్రువపత్రాల మంజూరులో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలంటూ టీడీపీ నాయకులు ఆదివారం పాశర్లపూడిలో నిరసన తెలిపారు. ఈసందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు మొల్లేటి శ్రీను మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల్లో కుల ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకుంటే కంప్యూటర్ డ్రాప్ బాక్సులో 50బీసీ కులాల పేర్లు ఉన్నప్పటికీ శెట్టిబలిజ కులం లేకుండా పోయిందన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ధ్రువపత్రాలు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోనం బాబు, కోలా రాంబాబు, చొల్లంగి రామకృష్ణ, గంధం భాస్కర్, చుట్టుగుళ్ల కిశోర్, పితాని వెంకటేశ్వరరావు, ఉండ్రు శ్రీరామారావు, వాసంశెట్టి వెంకట్రావు, కొల్లు ఏడుకొండలు పాల్గొన్నారు.