Raghurama : పెన్షన్ల పంపిణీపై రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు
ABN, Publish Date - Jul 01 , 2024 | 03:44 PM
ఏపీవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు.
పశ్చిమగోదావరి: ఏపీవ్యాప్తంగా సోమవారం లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 1,20,097 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొదటిరోజే చాలావరకు పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఉండిలో ఇంటింటికీ తిరిగి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ( Raghu Rama Krishna Raju) ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీని చేశారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ కార్యక్రమానికి భారతదేశంలోనే ఆధ్యుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు అని కొనియాడారు. ఆయన పేరు మీద ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉందని ఉద్ఘాటించారు. పెన్షన్ తో పంచే కరపత్రాలపై అధికారుల తప్పిదంతో స్వర్గీయ ఎన్టీఆర్ ఫొటో మిస్సయిందని తెలిపారు. వచ్చేనెల పెన్షన్ ఇచ్చేటప్పుడు ఎన్టీఆర్ ఫొటో ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ కార్యక్రమానికి ఆద్యుడు ఎన్టీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సామాన్య కార్యకర్తల పెన్షన్ అందివ్వడం అందరూ చాలా గర్వంగా చెప్పుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబు సంక్షేమం అభివృద్ధి కలగలిపిన పాలనలో రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు .
Updated Date - Jul 01 , 2024 | 03:44 PM