వెంకన్న ఆలయంలో పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Dec 08 , 2024 | 01:06 AM
ఆత్రేయపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ
రూ.31.68 లక్షల ఆదాయం
ఆత్రేయపురం, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పొటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, భాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి వివిధ రకాల పుష్పాల తో అలంకరించారు. భక్తులు స్వామివారి తీరువీధుల్లో 7 ప్రదక్షిణలు నిర్వహించుకుని స్వామిని దర్శించుకున్నారు. తులభారాలు, కానుకులు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. వి విధ సేవల ద్వారా రూ.31.68 లక్షలు లభించిన ట్టు ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.