ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: మీ సంగతి అమిత్‌షాకు చెబుతా..ఆ అధికారులపై పవన్ ఆగ్రహం

ABN, Publish Date - Nov 29 , 2024 | 04:03 PM

రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. రేషన్‌ మాఫియా వెనుక బలమైన నెట్‌వర్క్‌ ఉందని అన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

కాకినాడ: కాకినాడ పోర్టును స్మగ్లింగ్‌ హబ్‌గా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 51 వేల టన్నుల రేషన్‌ బియ్యం పట్టుకున్నామని అన్నారు. కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై పవన్‌ కల్యాణ్ సీరియస్‌ అయ్యారు. కాకినాడ పోర్టును పవన్ కల్యాణ్ ఇవాళ(శుక్రవారం) పరిశీలించారు. కాకినాడ పోర్టులో రేషన్‌ బియ్యం రవాణా అవుతుండటంపై అధికారులపై సీరియస్ అయ్యారు.

రేషన్‌ మాఫియా వెనుక బలమైన నెట్‌వర్క్‌

సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్లదూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూశారు. ఈ సందర్భంగా మీడియాతో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. కాకినాడ పోర్టుకు రోజుకు సుమారు వెయ్యి లారీలు వస్తాయని తెలిపారు. కాకినాడ పోర్టు దగ్గర సరైన భద్రత లేదని అన్నారు. కాకినాడ పోర్టు దగ్గర 16 మందే సెక్యూరిటీ ఉన్నారని చెప్పారు. రేషన్‌ మాఫియా వెనుక బలమైన నెట్‌వర్క్‌ ఉందని అన్నారు. తప్పు చేసిన ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాకినాడ పోర్టు నుంచి సరకుల ఎగుమతులు మాత్రమే జరగాలని తెలిపారు. కాకినాడ పోర్టు అధికారులు తనకే సహకరించలేదని అన్నారు.


మాఫియాను అరికడతాం..

పోర్టు అధికారులు కూడా సరిగా సమాధానం చెప్పలేదని ధ్వజమెత్తారు. రేషన్‌ మాఫియాను అరికడతామని చెప్పారు. రేషన్‌ మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో మాఫియా ఇష్టానుసారం చెలరేగిందని అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా అక్రమార్కులు వేలకోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. అవకతవకలకు పాల్పడితే పీడీ యాక్ట్‌ పెడతామని హెచ్చరించారు. ఏపీకి సముద్రతీరం అత్యంత లాభదాయకమని వివరంచారు. మనకు సముద్ర తీరం ఎంత బలమో.. అంతే బలహీనత కూడా అని తెలిపారు. ఇలానే వదిలేస్తే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. మన తీరప్రాంతాల్లో మారిటైమ్‌ భద్రత సరిగా లేదని చెప్పారు. కాకినాడ పోర్టుకు భద్రత పెంచాలని కేంద్ర హేంమంత్రికి లేఖ రాస్తానని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.


రేషన్‌ బియ్యంతో వేలకోట్ల వ్యాపారం

పారదర్శక పాలన అందిస్తామని ప్రజలకు మాట ఇచ్చామన్నారు. రేషన్ బియ్యం ఎగుమతిలో బయటకు చిన్నవారే కనిపిస్తున్నారని అన్నారు. రేషన్‌ బియ్యం అక్రమ ఎగుమతి వెనుక పెద్దవాళ్లు ఉన్నారని చెప్పారు. సీఐడీ, సీబీఐ.. ఎవరితో విచారణ చేయించాలో త్వరలో చెబుతామన్నారు. కాకినాడ యాంకర్‌ పోర్టు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉందని తెలిపారు. ఓడలోకి వెళ్లనీయకుండా తననే అడ్డుకున్నారంటే.. ఇక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. ఈ ఎగుమతులు సక్రమంగా జరిగి ఉంటే రాష్ట్ర ఖజానాకు డబ్బు వచ్చేదని అన్నారు. రేషన్‌ బియ్యం నిల్వలపై ప్రతి జిల్లాలో తనిఖీలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. కిలో రేషన్‌ బియ్యాన్ని రూ.73కి అమ్ముతున్నారని తెలిసిందన్నారు. కొందరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. రేషన్‌ బియ్యంతో రూ.వేలకోట్ల వ్యాపారం చేస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ ఆక్షేపించారు.


జాతీయ భద్రతకు ముప్పు...

‘‘పోర్టులు ఉన్నది బియ్యం స్మగ్లింగ్ చేయడానికా. సెంట్రల్ హోంమంత్రికి నోట్ , రిపోర్ట్ పంపుతున్నాను. ఏపీ డీజీపీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు షిప్ అయితే వదిలేస్తారా. ఎన్నాళ్ల నుంచి ఈ షిప్ ఆపరేట్ చేస్తున్నారు. మాట్లాడితే 10 వేల మంది జీవితాలు పోతాయంటారు. ఎన్నిసార్లు అడిగినా నన్ను వద్దు రావద్దు అంటారు. 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నాను. స్మగ్లర్లు బియ్యంతో ఆగుతారా. ఆర్‌డీఎక్స్ , డ్రగ్స్ , ఇలా ఏది కావాలంటే అది పోర్ట్ ద్వారా బహిరంగంగా స్మగ్లింగ్ చేయగలుగుతారు. మీకు అర్థమవుతుందా ఇది ఎంత ప్రమాదకరమో. ఇదొక్క లోతైన అగాధపు నెట్‌వర్క్. రేషన్ బియ్యం మాటేమిటి. డ్రగ్స్, గంజాయి ఏది ఇక్కడ నుంచి ఎగుమతి అవుతుందో తెలుసా. జాతీయ భద్రత మాటేమిటి. కసబ్ లాంటి తీవ్రవాదులు వస్తే ఎవరు బాధ్యులు. మన ఎమ్మెల్యేలను కూడా అడుగుతున్నా. పొలిటికల్ ప్రెజర్స్ అంటూ దేశ భద్రతకు తూట్లు పొడుస్తారా. ఏదైనా జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యులు. నేను వచ్చే టైంకి ఎస్పీ కనిపించరు. సెలవు పెడతారు.. అదే చాలా కొత్తగా ఉంది. పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఎంత ప్రమాదకరమో తెలుసా. ముంబై‌లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


చర్యలు తీసుకోవాలి..

రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్‌లో వెళ్లి పరిశీలించారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ప్రశ్నించారు. పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితే గాని చర్యలు తీసుకోలేరా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలోఎంతటివారున్నా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న అధికారులు ఏం చేస్తున్నారని నిలదీశారు.


టీడీపీ ఎమ్మెల్య‌ేపై సీరియస్

అక్రమాలపై స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చర్యలు తీసుకోకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దీని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు అక్రమార్కులకు సహకరించడం పద్ధతిగా లేదని ధ్వజమెత్తారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాస్తానని హెచ్చరించారు. పోర్టు అధికారుల పేర్లు నమోదు చేయాలని ఆదేశించారు. పోర్ట్ ఆఫీసర్ ధర్మ శాస్త్ర, డీఎస్పీ రఘు వీర్, సివిల్ సప్లై డీఎస్ఓ ప్రసాద్‌పై సీరియస్ అయ్యారు. ప్రభుత్వం సీరియస్‌గా ఉన్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా బియ్యం రవాణా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోర్టుకు రేషన్ రైస్ వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. స్వయంగా సంబంధిత మంత్రి వచ్చి చెప్పిన అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

RGV: నేను పరారీలో లేను.. పోలీసుల విచారణపై వర్మ వితండవాదం

YS Sharmila: జగన్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే.. షర్మిల ఎద్దేవా

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 04:28 PM