Share News

అసలే ఇరుకు... ఆపై నిర్మాణాలు!

ABN , Publish Date - Nov 25 , 2024 | 01:10 AM

పెద్దాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.. పైగా అక్కడే బస్టాండ్‌, మున్సిపల్‌ వాణిజ్య భవన సముదా యాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో వందలాదిగా వాహనాల రాకపోకలతో పాటు నిత్యం ప్రజలు రద్దీగా తిరుగుతుంటారు. అటు వంటి ప్రదేశంలో అనధికారికంగా మరో వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ఆర్టీసీ అధికా రులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. స్థానిక ఆర్టీసీ బస్టాం డ్‌కు ఆనుకు

అసలే ఇరుకు... ఆపై నిర్మాణాలు!
బస్టాండ్‌ ఆవరణలో నిర్మిస్తున్న వాణిజ్య సముదాయం

పెద్దాపురం బస్టాండ్‌ ఆవరణలో వాణిజ్య సముదాయాల నిర్మాణాలు

మున్సిపాలిటీ నుంచి ముందస్తు అనుమతులు నిల్‌

నిర్మాణం పూర్తయితే ప్రమాదాలు జరిగే అవకాశం

పెద్దాపురం, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అది నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం.. పైగా అక్కడే బస్టాండ్‌, మున్సిపల్‌ వాణిజ్య భవన సముదా యాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో వందలాదిగా వాహనాల రాకపోకలతో పాటు నిత్యం ప్రజలు రద్దీగా తిరుగుతుంటారు. అటు వంటి ప్రదేశంలో అనధికారికంగా మరో వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ఆర్టీసీ అధికా రులు చర్యలు చేపట్టారు. దీంతో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. స్థానిక ఆర్టీసీ బస్టాం డ్‌కు ఆనుకుని ఉన్న స్థలంలో వాణిజ్య భవన సముదాయాల నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో ఆ ప్రాంతం మరింత రద్దీగా మారడంతో పాటు పలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంద ని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు మున్సిపల్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సమీపంలోనే విద్యుత్‌ ట్రాన్సఫార్మర్‌ ఉండడంతో పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రదేశంలో వాణిజ్య సముదాయల నిర్మాణం చేపడితే అను కోని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాం తం ఇప్పటికే ఇరుకుగా ఉండడంతో బస్సుల రాక పోకలకు ఇబ్బంది కలుగుతోంది. వాణిజ్య సము దాయాల నిర్మాణం జరిగితే మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని, పైగా పలు ప్రమాదాలు జరుగుతాయనిప్రజలు ఆగ్రహం చెందుతున్నారు.

పట్టణంలో చర్చనీయాంశంగా...

ఇదిలా ఉండగా వాణిజ్య సముదాయల నిర్మా ణాలకు సంబంధించి ముందస్తుగా మున్సిపల్‌ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉన్నా అవేమీలేకుండానే నిర్మాణాలు ప్రారంభిం చేందుకు చర్యలను చేపట్టడంతో పట్టణంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారు లు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని పలు వురు ఆరోపిస్తున్నారు. పైగా మున్సిపాలిటీ ఆదా యానికి భారీగా గండిపడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య సముదా యల నిర్మాణం జరిగితే బస్టాండ్‌కి వచ్చేవారికి పార్కింగ్‌ చేసుకునే ప్రదేశం కూడా తగ్గిపో తుందని, అలాగే బస్సులు రాకపోకలకు ఇబ్బం దులు ఎదురవుతాయని పలువురు చెబుతున్నా రు. దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ కేవీ పద్మావతిని వివరణ కోరగా వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ఆర్టీసీ అధికారులు ఎటువంటి అను మతులు తీసుకోలేదని, అలాగే పలువురు కౌన్సిలర్లు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువ చ్చారని, దీంతో ఆర్టీసీ అధికారులకు లేఖ కూడా రాయడం జరిగిందన్నారు. ఆర్టీసీ కాకినాడ డీఎం మనోహర్‌ను వివరణ కోరగా ఆర్టీసీకి చెందిన స్థలాన్ని 15 ఏళ్లు కమర్షియల్‌ డవలప్‌మెంట్‌ కోసం లీజుకు ఇవ్వడం జరిగిందని, తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టనున్నట్టు తెలిపారు.

Updated Date - Nov 25 , 2024 | 01:10 AM