ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Rains: ఏపీలో దంచికొట్టుడే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే

ABN, Publish Date - Aug 31 , 2024 | 06:54 PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు రహదారులన్నీ జలమయం అయ్యాయి.

Heavy rains

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు రహదారులన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలో మరో రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర ఆల్పడినం వాయుగుండంగా మారిందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కళింగపట్నం దగ్గర అర్ధరాత్రి తీరం దాటే ఆవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం కళింగ పట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 80, విశాఖకు తూర్పున 120కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీ కృతమై ఉందని పేర్కొంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది.

YSRCP: విదేశాలకు జగన్.. వైసీపీలో సంక్షోభం తప్పదా


రెడ్ అలర్ట్..

ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా,గుంటూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అకస్మాత్తుగా వరదలు ముంచెత్తే అవకాశం ఉందని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రధాన పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ అయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించింది.

RK Roja: వైసీపీని వీడుతారన్న వార్తలపై తొలిసారిగా స్పందించిన రోజా..


ఇంద్రకీలాద్రిపై..

విజయవాడలో భారీగా కురుస్తున్న వర్షాలకు ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండమైన సమాచారా కేంద్రాన్ని పునర్ నిర్మించేందుకు అక్కడి నుంచి మూడు రోజుల క్రితమే తొలగించారు. ఆ ప్రదేశంలో కొడం చరియలు విరిగిపడ్డాయి.
Chandrababu: సీఎస్, డీజీపీకి సీఎం చంద్రబాబు ఆదేశం


ఏలూరు జిల్లాలో..

ఏలూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షం నేలకొరిగింది. ఈ చెట్టు పడిపోవడంతో విద్యుత్తు, కేబుల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విద్యుత్తు, ఇంటర్నెట్ సేవలను త్వరితగతిన పునరుద్దరించేందుకు సంబంధిత అధికారులు ప్రయత్నిస్తున్నారు.


YS Sharmila: జగన్‌ బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Aug 31 , 2024 | 06:54 PM

Advertising
Advertising