Kakinada: ఓ ఇంటి స్థల వివాదం ఎంత పని చేసిందంటే.. సంచలనం రేపుతున్న ఘటన..
ABN, Publish Date - Dec 15 , 2024 | 09:03 PM
సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంటి స్థలం వివాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా నరికి చంపారు.
కాకినాడ: సామర్లకోట మండలం వేట్లపాలెంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ఇంటి స్థలం వివాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. వేట్లపాలెం గ్రామం దళితపేటకు చెందిన బచ్చల, కార్దాల అనే రెండు కుటుంబాల మధ్య ఓ ఇంటి స్థల విషయమై ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. ఆ స్థలం మాదంటే మాదని ఇరు కుటుంబాల సభ్యులు గత కొంతకాలంగా గొడవలకు దిగుతున్నారు. పలుమార్లు ఘర్షణలు పడ్డారు.
Eluru: తనిఖీల కోసం వెళ్లిన పోలీసులపై తేనెటీగలు దాడి..
అయితే అదే స్థలంలో ఇల్లు నిర్మించేందుకు ఓ వర్గంవారు ఇవాళ (ఆదివారం) పనులు ప్రారంభించారు. అయితే మరోవర్గం వారు దీనికి అడ్డుపడ్డారు. పనులు నిలివేయాలంటూ గొవడకు దిగారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇవాళ రాత్రి మరోసారి వివాదం చెలరేగింది. ఇది కాస్త చిలికిచిలికి గాలివానలా మారి ఇరువర్గాలు దాడులకు దిగాయి. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అనంతరం రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు.
Eluru: రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. పెళ్లి చేయాలంటూ ఏకంగా కత్తితో..
కార్దాల కుటుంబాన్ని హతమార్చడమే లక్ష్యంగా బచ్చల కుటుంబ సభ్యులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. కత్తులు, ఇనుప రాడ్లతో కార్దాల కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. ప్రత్యర్థుల దాడిలో కార్దాల ప్రకాశం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కార్దాల చంద్రరావు, కార్దాల ఏసుబాబు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakha: రుషికొండ భవనాల నిర్మాణం పిచ్చి పని: అశోక్ గజపతిరాజు ఆగ్రహం..
CM Chandrababu: వారివి అన్నీ దొంగ బుద్దులే.. అన్నీ దొంగ నాటకాలే: సీఎం చంద్రబాబు..
Updated Date - Dec 15 , 2024 | 10:03 PM