ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...

ABN, Publish Date - Apr 04 , 2024 | 09:50 AM

Andhrapradesh: పేదలకు ఫించన్ అందకుండా చేసే వైసీపీ కుట్రలను ఎందాకైనా అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పైశాచికత్వానికి చంద్రబాబు పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు పోరాటం మానవత్వం కోసమని.. జగన్ పాకులాట మనుషుల్ని హింసించడమని మండిపడ్డారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం అయితే.. వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని విమర్శలు గుప్పించారు.

అమరావతి, ఏప్రిల్ 4: పేదలకు ఫించన్ (AP Pension) అందకుండా చేసే వైసీపీ (YSRCP) కుట్రలను ఎందాకైనా అడ్డుకుంటామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (Addanki MLA Gottipati Ravikumar) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ (CM Jagan) పైశాచికత్వానికి చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) పోరాటతత్వానికి మధ్య జరిగే పోరులో ప్రజలు తమ వెంటే ఉన్నారన్నారు. చంద్రబాబు పోరాటం మానవత్వం కోసమని.. జగన్ పాకులాట మనుషుల్ని హింసించడమని మండిపడ్డారు. తెలుగుదేశం ధ్యేయం పేదల సంక్షేమం అయితే.. వైసీపీ లక్ష్యం శవ రాజకీయమని విమర్శలు గుప్పించారు. ప్రతీ ఎన్నికల్లానే ఈసారి వైసీపీ తన శవ రాజకీయాలకు అవ్వ తాతలను బలికోరుతోందన్నారు. పేదలకు ఫించన్ ఇప్పించే విషయంలో ఎందాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. ఫించన్ పంపిణీలో పేదల్ని ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న జగన్‌కు ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ హెచ్చరించారు.

YS Vijayamma: కూతురు షర్మిల వైపా.. వైఎస్ జగన్ వైపా..?


సర్కార్ ఇబ్బందులు...

నిన్న రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ జరగాల్సి ఉండగా.. సాయంత్రం వరకు సొమ్ము ఇవ్వకుండా సర్కార్ ఇబ్బందులకు గురిచేసింది. ఫలితంగా పెన్షన్ల కోసం ఉదయాన్ని సచివాలయాలకు వచ్చిన వృద్ధులు అవస్థలు పడ్డారు. తీవ్రమై ఎండవేడిమితో పలువురు వృద్ధులు నరకయాతన అనుభవించారు. కనీసం పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా కల్పించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


తొలిరోజు పింఛన్లు అందుకున్న వారి సంఖ్య...

మరోవైపు ఏపీ పింఛన్ల పంపిణీలో భాగంగా తొలిరోజు బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించినట్టు పంచాయితీ రాజ్‌, గ్రామీణాభివృద్థి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ తెలిపారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసిందన్నారు. మొత్తం 14,994 గ్రామ, వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించినట్టు తెలిపారు. గురువారం నుంచి ఉదయం 7 గంటలకే పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని శశిభూషణ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

Holidays: ఏపీలో కాలేజీ విద్యార్థులకు వేసవి సెలవులు.. యాజమాన్యాలకు హెచ్చరిక..

AP Polls 2024: టీడీపీలోకి రఘురామ.. పోటీ స్థానంపై ఫుల్ క్లారిటీ!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 11:35 AM

Advertising
Advertising