ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: మంత్రి పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం

ABN, Publish Date - Apr 26 , 2024 | 10:07 AM

Andhrapradesh: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ప్రచార శ్రేణులపై కర్రలతో దాడులు పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులుకు దిగారు.

YCP Activists are agitated in Chittoor

చిత్తూరు, ఏప్రిల్ 26: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) ఇలాక పుంగనూరులో వైసీపీ (YSRCP) అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ప్రచార శ్రేణులపై కర్రలతో దాడులు పాల్పడ్డారు. తమ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తే చంపేస్తామంటూ బెదిరింపులుకు దిగారు. పుంగనూరు మండలం మాగాండ్ల పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

YS Jagan: పథకాలు పీకేసి.. దళితులకు దగా చేసి..


అసలేం జరిగిందంటే..

ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ పుంగనూరు మండలం మాగాండ్ల పల్లెలో రోడ్ షో నిర్వహించారు. ఈ క్రమంలో బీసీఐ శ్రేణులపై వైసీపీ శ్రేణులు విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు బీసీవై పార్టీ మేనిఫెస్టో పాంప్లెట్లు పంపిణీ చేస్తూ వెళుతుండగా వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. ప్రచారం చేస్తున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా తమ గ్రామంలో ప్రచారం చేయరాదంటూ పాంప్లెట్లు చింపి వేస్తూ దుర్భాషలాడారు. బీసీవై నాయకులకు చెందిన బొలేరో వాహనంలో వెళుతుండగా రాళ్లతో అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకుని పోలీస్ బలగాలు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. గ్రామంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురయ్యారు.


ఇవి కూడా చదవండి...

YS Avinash: పాపం.. పిల్లోడు!

BRS: రాజీనామా లేఖతో అమర వీరుల స్తూపం వద్దకు హరీష్ రావు..!

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 26 , 2024 | 10:20 AM

Advertising
Advertising