AP Police: జగన్‌పై రాయి విసిరిందెవరో చెప్పేయండి.. బహుమతి పట్టేయండి!
ABN, Publish Date - Apr 15 , 2024 | 02:29 PM
Andhrapradesh: ఎన్నికల వేళ ఏపీలో చిత్ర విచత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఏకంగా ముఖ్యమంత్రిపై రాయి విసరడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. విజయవాడ సింగ్‌నగర్‌లో ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తుండగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై ఆగంతకులు రెండు రాళ్లు విసిరారు. ఈ దాడిలో రాయి తగలడంతో జగన్ కంటికి గాయం అవగా, మరో రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగినప్పటికీ సదరు వ్యక్తులు ఇప్పటికీ దొరకకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పట్టిష్టమైన భద్రత ఉన్నప్పటికీ.. చుట్టూతా పోలీసుల వలయాన్ని దాటి మరీ సీఎంకు తగిలేలా దాడి చేయడం అనేది అసంభవం.
విజయవాడ, ఏప్రిల్ 15: ఎన్నికల వేళ (AP Elections) ఏపీలో చిత్ర విచత్రమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఏకంగా ముఖ్యమంత్రిపై రాయి విసరడం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. విజయవాడ సింగ్‌నగర్‌లో ఎన్నికలు ప్రచారం నిర్వహిస్తుండగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan Reddy) ఆగంతకులు రెండు రాళ్లు విసిరారు. ఈ దాడిలో రాయి తగలడంతో జగన్ కంటికి గాయం అవగా, మరో రాయి పక్కనే ఉన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు తగిలింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అయితే సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగినప్పటికీ సదరు వ్యక్తులు ఇప్పటికీ దొరకకపోవడం గమనార్హం. పట్టిష్టమైన భద్రత ఉన్నప్పటికీ.. చుట్టూతా పోలీసుల వలయాన్ని దాటి మరీ సీఎంకు తగిలేలా దాడి చేయడం అనేది అసంభవం. కానీ అవన్నీ దాటుకుని మరీ ముఖ్యమంత్రిపై కొందరు ఆగంతకులు గులకరాళ్లతో దాడి చేయడం అనేక అనుమానాలను రేపుతోంది. అయితే ఆగంతకులకు పట్టుకునేందుకు పోలీసులు ఎంచుకున్న మార్గం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.
Viral Video: బంగారం, వెండి పానీపూరీలను చూశారా? వైరల్ అవుతున్న వీడియో చూస్తే అవాక్కవడం ఖాయం..!
బంపరాఫర్ ఇదే...
అయితే ముఖ్యమంత్రిపై దాడి జరిగి గంటలు గడుస్తున్నప్పటికీ నిందితులను పట్టుకోకపోవడంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు ఓ బంపరాఫర్‌ను ప్రకటించారు. సీఎం జగన్‌పై రాయి వేసిన వారి ఆచూకీ చెబితే రెండు లక్షల బహుమతి అంటూ ఖాకీలు ప్రకటించారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి చేసిన వారి వివరాలు తెలపాలంటూ పోలీసులు సోమవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారాన్ని, దృశ్యాలను (సెల్ ఫోన్, వీడియో రికార్డింగ్స్) అందించాలని విజ్ఞప్తి చేశారు.
Gorantla Butchaiah Chowdary: కరెంట్ తీయటం జగన్ కుట్ర కాదా?
ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి కలవాలని సూచించారు. కేసుకు దోహదపడే సమాచారం అందించినవారికి 2 లక్షల రూపాయల నగదును బహుమతిగా ఇస్తామని కూడా ప్రకటించారు. అయితే సమాచారం ఇచ్చిన వారి వివరాలు బయటపెట్టమని.. గోప్యంగా ఉంచుతామని అన్నారు. నిందితుల వివరాలను తెలిపేందుకు ఇద్దరు పోలీసు అధికారుల ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు.
ఫోన్‌నెంబర్లు ఇవే..
1.కంచి శ్రీనివాస రావు, డీసీపీ, ఎన్టీఆర్ పోలీస్ కమీషనరేట్ - 9490619342
2. ఆర్.శ్రీహరిబాబు, ఏడీసీపీ టాస్క్ ఫోర్సు – 9440627089
ఆఫీస్ అడ్రస్..
అలాగే ఆగంతకుల వివరాలు చెప్పేందుకు అడ్రస్‌ను కూడా తెలిపారు. ‘‘కమీషనర్స్ టాస్క్ఫోర్స్ కార్యాలయం, నేతాజీ బ్రిడ్జి రోడ్, పశువుల ఆసుపత్రి పక్కన, లబ్బిపేట, కృష్ణ లంక, విజయవాడకు వచ్చి ఆగంతకుల వివరాలు చెప్పాల్సిందిగా పత్రికా ప్రకటనలో పోలీసులు వినతి చేశారు.
ఇవి కూడా చదవండి...
Delhi Liquor Scam: మళ్లీ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఎందుకంటే..
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 15 , 2024 | 02:51 PM