ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

ABN, Publish Date - May 03 , 2024 | 01:30 PM

Andhrapradesh: మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు.

YSRCP Candidate Perni Kittu

కృష్ణా, మే 3: మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై (YSRCP Candidate Perni Kittu) హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ డివిజన్ జనసేన నేత కర్రి మహేష్ ఇంట్లోకి కిట్టు అనుచరులు చొరబడి దాడి చేశారు. పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారంలో (Election Campaign) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులో మొత్తం ఆరుగురిపై హత్యాయత్నం కేసు నమోదు అయ్యింది. A1గా పేర్ని కిట్టుని పోలీసులు చూపించారు. చిలకలపూడి గాంధి, చిలంకుర్తి వినయ్, శీనయ్య, ధనబాబు, లంకే రమేష్‌లపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.

AP Election 2024: నా కూతురు నా ప్రాపర్టీ కాదు: ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు


A1 పేర్ని కిట్టు మినహా మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరికాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ కేసులో జనసేన నేత కర్రి మహేష్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కర్రి మహేష్‌తో పాటు మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కులం పేరుతో దూషించారని వైసీపీకి చెందిన దళిత మహిళ డి.నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్రి మహేష్‌పై కూడా పోలీసులు కేసు చేశారు.

Lok Sabha Polls: తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో వచ్చేసింది.. హామీలే హామీలు


అసలేం జరిగిందంటే..

గురువారం మచిలీపట్నంలోని విశ్వ బ్రాహ్మణ కాలనీలో వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోజనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పేర్ని కిట్టు అనుచరులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదంటని ప్రశ్నించడంతో పేర్ని కిట్టు అనుచులు రెచ్చిపోయారు. ఏకంగా కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనపై జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఇవి కూడా చదవండి...

Facebook: ఫేస్‌బుక్‌లో పరిచయాలు.. ఇంటికి రమ్మంటూ ఆహ్వానాలు

Helicopter: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్.. కీలక నేతకు..

Read Latest AP News And Telugu News

Updated Date - May 03 , 2024 | 01:33 PM

Advertising
Advertising