ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: ముస్లింలు ఎలాంటి ఆందోళన చెందవద్దు... సుజనా భరోసా

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:03 AM

Andhrapradesh: నగరంలోని వన్ టౌన్ 55వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనాను కలిసి మహిళలు తమ సమస్యలను ఏకరుపెట్టారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ, సమస్యలు పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకుని చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. ముస్లింకు రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు.

విజయవాడ, ఏప్రిల్ 26: నగరంలోని వన్ టౌన్ 55వ డివిజన్‌లో కూటమి పార్టీల బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి (BJP Candidate Sujana Chowdary) ఎన్నికల ప్రచారం (Election Campaign) నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనాను కలిసి మహిళలు తమ సమస్యలను ఏకరుపెట్టారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ, సమస్యలు పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకుని చేస్తానని సుజనా హామీ ఇచ్చారు. ముస్లింకు రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న ప్రచారంపై కూడా క్లారిటీ ఇచ్చారు. ముస్లింలు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. కొన్ని పార్టీలు ఓటమి భయంతో ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారన్న సుజనా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఒక్కరు కాదు.. ముగ్గురు పవన్‌లు.. పేర్లతో పరేషాన్‌!


జగన్ ప్రభుత్వాన్ని ఓడించండి...

‘‘55వ డివిజన్ కంసాలి పేట ప్రాంతాల్లో నేడు పర్యటించాను. ప్రజలందరూ నాకు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక్కడ ఎక్కువ మంది పేదలుగానే మిగిలిపోయారు. డ్రైనేజీ, కరెంటు సిస్టం లు ఇక్కడ అధ్వాన్నంగా ఉన్నాయి. పేదలు మరింత పేదలుగానే మారిపోతున్నారు. సంపదను సృష్టించి, ఆదాయం పెంచే మార్గాలు వీరికి‌ పాలకులు చూపలేదు. ప్రభుత్వాలు సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఉపాధి అవకాశాలు చూపాలి. ఈ ఐదేళ్లల్లో ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. సంక్షేమం పేరుతో ఆదాయ మార్గాలను కూడా దెబ్బ తీసింది. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వ నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రభుత్వాన్ని ఓడించి ఇంటికి పంపాలి. ఇప్పటికే ఇరవై యేళ్లు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లారు. ఎన్డీఏ కూటమి వల్లే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. వైసీపీ ప్రభుత్వం వల్ల అవకాశాలు కోసం పొట్ట చేత పట్టుకుని వలసలు వెళ్లిపోయారు’’ అని తెలిపారు.

Viral Video: SRH ఓటమి కావ్య మారన్ రియాక్షన్స్ వైరల్


ముస్లింలకు అండగా ఉంటాం...

ముస్లింలు కూడా ఎటువంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. వారికి మోడీ హయాంలో భద్రత పెరిగిందన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శం గా నిలపెడతామన్నారు. ఈ నియోజకవర్గంలో పేదలు ఎక్కువమంది ఉన్నారని.. వారి ఆర్ధిక ప్రయోజనాలు పెంచి, జీవన ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ముస్లింలకు అండగా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు. గత పాలకుల్లా తాను మాటలు చెప్పే వ్యక్తిని కానన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఎంత చేస్తామో ముందు ముందు చూస్తారన్నారు. కమలం, సైకిల్ గుర్తులకే ఓటు వేయాలని... ఫలితాలు చూడాలన్నారు.


కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పని చేసిన తన అనుభవం ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఈ నియోజకవర్గానికి తీసుకు వస్తానన్నారు. త్వరలోనే ఆయన వస్తారని... ఈ నియోజకవర్గానికి మహర్దశ పడుతుందని చెప్పుకొచ్చారు. కులాలు, మతాలు కాదు మానవత్వంతో పని చేయడమే తనకు తెలుసన్నారు. ప్రత్యర్థి పార్టీల తనపై నిందలు వేయడం సహజమన్నారు. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. దిగజారి మాట్లాడే వ్యక్తుల గురించి స్పందించనని సుజనా చౌదరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

BRS: రాజీనామా లేఖతో అమర వీరుల స్తూపం వద్దకు హరీష్ రావు..!

Hyderabad: నేరగాళ్లతో దోస్తీ.. మంగళ్‌హట్‌ డీఐ సస్పెన్షన్‌

Read Latest AP News And Telugu New

Updated Date - Apr 26 , 2024 | 01:26 PM

Advertising
Advertising