ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

chandrababu: జగన్ ఎక్స్‌ఫైర్ అయిపోయిన మెడిసిన్.. చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు

ABN, Publish Date - Apr 22 , 2024 | 09:02 PM

రాష్ట్రమంతా మాదకద్రవ్యాల మయమైపోయిందని తెలుగుదేశం జాతీ య అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు విజయనగరంలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

విజయనగరం: రాష్ట్రమంతా మాదకద్రవ్యాల మయమైపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. సోమవారం నాడు విజయనగరంలో జరుగుతున్న ‘ప్రజాగళం’ భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మే 13వ తేదీన వస్తున్న రాజకీయ తుఫాన్‌తో వైసీపీ బంగాళాఖాతంలో కలసిపోవడం ఖాయమన్నారు. విశాఖను గంజాయికి క్యాపిటల్‌గా మార్చారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో బ్లేడు బ్యాచ్‌లు, గంజాయి బ్యాచ్‌లు తిరుగుతున్నాయని ఆరోపించారు.


Ashok babu: ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైసీపీ

ఉత్తరాంధ్రాలో వైసీపీ నేతలు రూ.40 వేల కోట్లు దోచేశారని విమర్శించారు. మూడు సెంట్లు ఇంటి స్థలం అందించే బాధ్యత తమదన్నారు. రాష్ట్రాన్ని దోచేసిన బంధిపోటు జగన్ అని విమర్శించారు. దేశాన్ని కాపాడటంలో ఉత్తరాంధ్రా ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ కోసమన్నారు. జగన్ రూ.10 ఇచ్చి.. రూ.100లు దోచేశారని ధ్వజమెత్తారు. ఆయన తండ్రి సంపాదించిన ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వకుండా అప్పిచ్చారని మండిపడ్డారు.


Bride Kidnap: షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తానని చెప్పారు. తనకు పదవులపై ఆశ లేదని.. ప్రజల బాగోగులపై శ్రద్ధ ఉందన్నారు. తనను అరెస్ట్ చేస్తే 60 దేశాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు స్పందించారని చెప్పుకొచ్చారు. తమ కూటమి అధికారంలోకి వచ్చాక రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా.. మూడో నెల మొత్తం పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. శృంగవరపుకోటను విశాఖ జిల్లాలో విలీనం చేస్తామని మాటిచ్చారు. జగన్ ఎక్స్‌ఫైర్ అయిపోయిన మెడిసిన్ అని చంద్రబాబు సెటైర్లు గుప్పించారు.


ఇవి కూడా చదవండి

Nellore: భిన్నవ్యక్తిత్వాల మధ్య పోరు.. ఎవరిదో జోరు!

Chandrababu: వైసీపీ అక్రమాలను అణిచేద్దాం... సీఎం జగన్‌పై చంద్రబాబు ఫైర్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 22 , 2024 | 09:20 PM

Advertising
Advertising