ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandrababu: కొండలను మింగిన అనకొండ జగన్‌

ABN, Publish Date - Apr 15 , 2024 | 03:22 AM

ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలోని ఐదుగురు ఉత్తరాంధ్రను ఊడ్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వనరులను దోచుకున్నారని దుయ్యబట్టారు. కొండలను సైతం అనకొండలా మింగేశారని, చివరకు రుషికొండను

Chandrababu

  • ఈ సీఎం రుషికొండనూ వదల్లేదు: చంద్రబాబు

  • ఐదేళ్లలో ఉత్తరాంధ్రను ఐదుగురు ఊడ్చేశారు

  • జగన్‌రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరులన్నీ మింగేశారు

  • మేమొచ్చాక స్కాంలు చేసినవారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం

  • రాష్ట్రాభివృద్ధికి కంపెనీలు రావాలి.. ఈ సీఎం ఉన్నవాటినీ తరిమేశాడు

  • నేనొస్తే పారిశ్రామిక వెలుగులు, జగన్‌ వస్తే గంజాయి వనాలు

  • ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి.. పేదల రక్తం తాగే జలగ

  • పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం.. ఇప్పటికే ఇచ్చినవి రద్దు చేయం

  • ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక పాలసీ.. ప్రజాగళంలో బాబు హామీలు

విశాఖకు మా హయాంలో విదేశాల నుంచి పెట్టుబడులు వస్తే.. వైపీపీ ప్రభుత్వంలో ఇటీవల 25 వేల కిలోల డ్రగ్స్‌ వచ్చాయి. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం పూర్తిగా గాడి తప్పింది. తిరిగి గాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటా. 14 ఏళ్లు సీఎంగా ఎంతగా అభివృద్ధి చేశానో.. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా. ప్రశ్నించే వారిపై వేధింపులు, మాట్లాడే వారిపై కేసులతో గొంతు నొక్కే ప్రయత్నం జగన్‌ సాగించా డు. నాపై ఎన్ని కేసులు ఉన్నాయో ఇప్పటివరకూ తెలియదు. కేసులు చిట్టా ఇవ్వాలంటూ డీజీపీకి లే ఖ కూడా రాశానంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

- చంద్రబాబు

పాయకరావుపేట/విశాఖపట్నం/గాజువాక, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వంలోని ఐదుగురు ఉత్తరాంధ్రను ఊడ్చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సీఎం జగన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వనరులను దోచుకున్నారని దుయ్యబట్టారు. కొండలను సైతం అనకొండలా మింగేశారని, చివరకు రుషికొండను కూడా సీఎం వదల్లేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేని గెలిపించి, రాష్ర్టాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ప్రజాగళంలో భాగం గా ఆదివారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, విశాఖ జిల్లా గాజువాకల్లో నిర్వహించి న భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. తొలుత పాయకరావుపేటలో అంబేడ్క ర్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


అనంతరం మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో కుంభకోణాలు చేసిన వారిని తాము అధికారంలోకి వచ్చాక ఉక్కుపాదంతో అణచివేస్తామన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టీడీపీ కూ టమికి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. 27 దళిత సంక్షేమ పథకాలను రద్దు చేసిన దళిత ద్రోహి జగన్‌ అని ధ్వజమెత్తారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగనేనన్నారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, ఇళ్ల నిర్మాణాలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం పేదలకు ఇచ్చిన ఇళ్ల జాగాలను రద్దు చేయబోమన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో 4 కోట్ల ఇళ్లు నిర్మించిందని.. రానున్న ఐదేళ్లలో మరో 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తారని, అందులో భాగంగా మన రాష్ట్రంలో 30-40 లక్షల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ఆటో డ్రైవర్లకు ఇబ్బం ది లేకుండా వారిని ఆదుకునేందుకు కొత్త పాలసీని అమలు చేస్తానని చెప్పారు. సామాజిక పింఛన్‌ రూ.4 వేలకు పెంచడమే కాకుండా ఏప్రిల్‌ నెల నుంచి బకాయిలు కూడా అందజేస్తామన్నారు. వలంటీర్లకు రూ.10 వేలు అందిస్తామని.. వారికి నైపుణ్య శిక్షణ అందించి నెలకు రూ.లక్ష సంపాదించేలా చేస్తానని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు భృతి ఇస్తామన్నారు. తమ మేనిఫెస్టోలో ఉన్న యువగళం, బీజేపీ మేనిఫెస్టోలో ఉన్న యువశక్తి పథకాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ‘బానిసలుగా పెట్టి ఊడిగం చేయించుకునే విధానం జగన్‌ది. నేరాలు, ఘోరాలు చేయించి ఎంగిలి మెతుకులతో పడి ఉండాలన్నది ఆయన తత్వం. అందరూ ఆత్మగౌరవంతో బతకాలన్న ది నా విధానం. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడం జగన్‌ పాలసీ. వ్యవస్థలను భ్రష్టుపట్టించారు’ అని ధ్వజమెత్తారు.


కంపెనీలను తరిమేశారు..

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపెనీలు రావాలి. కానీ ఈ దుర్మార్గుడు జగన్‌ ఉన్న కంపెనీలను తరిమేశాడు. విశాఖలో మిలీనియం టవర్స్‌ నుంచి ఐటీ కంపెనీలు, ఇంకా లులూ గ్రూ పు, అదానీ డేటా సెంటర్‌ అన్నీ పోయాయి. మా ప్రభు త్వం వస్తే పరిశ్రమలు వస్తాయి. మళ్లీ జగన్‌ వస్తే గంజాయి వస్తుంది. విశాఖలో శాంతిభద్రతలు లేవు. ఎంపీ కుటుంబ సభ్యులను నిర్బంధిస్తేనే దిక్కు లేదు. మా ప్రభుత్వం ఏర్పాటయ్యాక సంపద సృష్టించి, తద్వారా అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తాం. బీసీలకు అండగా ఉంటాం. 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం.


ప్రభుత్వ సహకారం లేకుండా సాధ్యమా?

విశాఖ పోర్టు ద్వారా 25 వేల కేజీల డ్రగ్స్‌ దిగుమతి చేశారు. రాష్ట్రప్రభుత్వ సహకారం లేకుండా ఇది సాధ్యపడుతుందా? ఎంతోమంది చిన్నారులు డ్రగ్స్‌కు, గంజాయికి బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై గతంలో హెచ్చరించాను. కేంద్రానికి కూడా ఫిర్యాదు చేశాను. డ్రగ్స్‌, గంజాయిపై పోరాడాలని నేను చెబితే.. మా పార్టీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. నేను సీఎం గా ఉండి ఉంటే అటువంటి వారికి చివరిరోజు అయి ఉండేది. ఇదో చెత్త, చేతగాని ప్రభుత్వం. గతంలో విశాఖకు పవన్‌ కల్యాణ్‌, నేను వస్తే అడ్డుకున్నారు. ఇది మీ తాత జాగీరా..? నేను ఇలానే అడ్డుకుని ఉంటే జగన్‌ పాదయాత్ర చేసేవాడా..? విభజిత ఏపీలో అటువంటి మరో రాజధాని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతోనే రాజధాని అమరావతిని ప్రారంభించాను. పోలవరం నిర్మాణంతోపాటు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాను. కానీ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చాడు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించి ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో భస్మాసుర వధ జరగాలి. కరెంటు చార్జీలను జగన్‌ గత ఐదేళ్లలో తొమ్మిది సార్లు పెంచాడు. ఏప్రిల్‌ నెల కరెంట్‌ బిల్లు చూస్తే ఎవరికైనా గుండె ఆగిపోతుంది. మూడుసార్లు ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచాడు. కాగా, చంద్రబాబు సోమవారం రాజాం, పలాస నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజాగళం సభల్లో పాల్గొంటారు.


విశాఖను ఎంతో అభివృద్ధి చేశా..

నేను సీఎంగా ఉన్నప్పుడు విశాఖపట్నాన్ని అభివృద్ధి చేశా. హుద్‌హుద్‌కు ముందు, తర్వాత అన్న రీతిలో తీర్చిదిద్దాను. పరిశ్రమలు తెచ్చా. ఐటీ కంపెనీలు పెట్టా. టూరి జం, ఐటీ హబ్‌గా తయారుచేశా. 200 ఎకరాల్లో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటుచేశా. ఐఐఎంతోపాటు అనేక యూనివర్సిటీ లు తెచ్చా. అటువంటి విశాఖను ఐదేళ్లలో ఈ ప్రభుత్వం గంజాయి కేంద్రంగా మార్చేసింది. విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదలకు జగన్‌ ముందుకొస్తే నేనూ వస్తానని చెప్పాను. కానీ ఆయన పట్టించుకోలేదు. అటువంటి వ్యక్తికి ఓటడిగే హక్కుందా..? స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా బాధ్యత తీసుకుంటా.

Updated Date - Apr 15 , 2024 | 07:50 AM

Advertising
Advertising