AP Elections 2024: వైసీపీ దుష్ప్రచారం.. పథకాల్లేవంటూ చంద్రబాబు ‘ఫేక్ ఆడియో’ వైరల్
ABN, Publish Date - May 12 , 2024 | 04:29 PM
వైసీపీ దుష్ప్రచారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీడీపీ కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు లేని విషయాలను సైతం సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తోంది. టీడీపీ కూటమికి..
వైసీపీ (YSRCP) దుష్ప్రచారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టీడీపీ కూటమిపై (TDP Alliance) ప్రజల్లో వ్యతిరేకత పెంచేందుకు లేని విషయాలను సైతం సృష్టించి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వస్తోంది. టీడీపీ కూటమికి ఓటు వేస్తే ఏదేదో జరిగిపోతుందని, రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతారని, పథకాలన్నీ ఆపేస్తారంటూ ఇప్పటికే చాలాసార్లు ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వైసీపీ పన్నాగాలు పన్నింది. ఇప్పుడు వాట్సాప్‌లోనూ మరో దుష్ప్రచారానికి తెరలేపింది. అధికారంలోకి వచ్చాక పథకాలేమీ ఉండవని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చెప్తున్నట్టు.. ఓ ఫేక్ ఆడియోను ఆ అధికారి పార్టీ వైరల్ చేస్తోంది.
ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌కు ఇరాన్ ‘న్యూక్లియర్’ వార్నింగ్
ఇంతకీ ఆ ఫేక్ ఆడియోలో ఏముందంటే.. ‘‘త్వరలోనే పోలింగ్ ఉంది. ఇంకొంచెం పంపించండి. మొత్తం అమరావతికే కుమ్మరిస్తాం. ఏం చేసైనా సరే అమరావతిని అభివృద్ధి చేస్తాం. మా ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలుస్తున్నాం. పవర్‌లోకి రావడం తథ్యం. అధికారంలోకి వచ్చాక పథకాల్లేవ్ ఏం లేవు. అమరావతిని అభివృద్ధి చేస్తే నువ్వు ఇమాజిన్ చేయలేనంత రిటర్న్స్ ఉంటాయి. త్వరలో మీకు లాభాలు చూపిస్తాం’’ అని చంద్రబాబు చెప్తున్నట్లు ఉంది.
ఖండించిన చంద్రబాబు
అయితే ఇదొక ఫేక్ ఆడియో క్లిప్ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ కుయుక్తులపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటమి భయంతోనే వైసీపీ ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపిందని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రాలేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాన్ని మోసం చేయాలనే చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్‌ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలెవరూ ఈ ఫేక్ ప్రచారాలను నమ్మకండి. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఎన్ని వేషాలేసినా, తలకిందులుగా తపస్సు చేసినా.. వైసీపీ ఓటమి తథ్యమని, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని బొందపెడతారని తెలుగుదేశం పార్టీ కూడా ఘాటుగా స్పందించింది.
Read Latest Andhra Pradesh News and Telugu News
Updated Date - May 12 , 2024 | 04:29 PM