Chandrababu: యుద్ధంలో గెలిచి తీరాలి.. శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం..
ABN, Publish Date - Mar 23 , 2024 | 12:45 PM
ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన టీడీపీ వర్కషాప్‌లో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తున్నామన్నారు.
ఎన్నికల యుద్ధంలో గెలిచి తీరాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో జరిగిన టీడీపీ వర్కషాప్‌లో ఆయన మాట్లాడారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తున్నామన్నారు. వైసీపీ కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు. గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలిపించాలని, మూడు పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. రాజకీయ పార్టీ ప్రయోజనం కోసమో.. గెలిచే అభ్యర్థుల ప్రయోజనాల కోసం తాను ఆలోచించడం లేదని రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నట్లు చెప్పారు. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టడమే తన ముందున్న లక్ష్యమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చాలా కసరత్తు తర్వాత అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు. సర్వేల ఆధారంగా టికెట్లు కేటాయించినట్లు తెలిపారు. పార్టీలో ఎప్పటినుంచో ఉంటున్న కొందరికి టికెట్లు ఇవ్వలేకపోయామని.. వైసీపీని బలంగా ఎదుర్కొనేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవల్సి వచ్చినట్లు చంద్రబాబు వివరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతి కార్యకర్త, ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
Chandrababu: విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది వైసీపీ నేతలే.. ఆధారాలతో బయటపెట్టిన చంద్రబాబు!
ఓట్లు చీలకూడదు..
ఈ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదనే లక్ష్యంతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ముందుకు వచ్చారని మన లక్ష్యం కూడా అదేనని చంద్రబాబు తెలిపారు. పొత్తులపై అసత్యాలు ప్రచారం చేస్తూ వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. వైసీపీ అసత్య ప్రచారాలను నమ్మకుండా.. కూటమి అభ్యర్థులనే రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని కోరారు. తాను 160 నియోజకవర్గాల్లో 160 సభల్లో పాల్గొంటానని.. 160 నియోజకవర్గాల్లో కూటమిని గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 23 , 2024 | 06:22 PM