CM JAGAN: నేను బచ్చానే.. చంద్రబాబు భయపడ్డారు
ABN, Publish Date - Apr 20 , 2024 | 07:21 PM
‘సిద్ధం’ సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN అన్నారు. శనివారం నాడు అనకాపల్లి జిల్లాలో ‘మేముసిద్ధం’సభలో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు భయపడి తన మీద రాళ్లు వేయమంటున్నారని అన్నారు.
అనకాపల్లి జిల్లా: ‘సిద్ధం’ సభలు చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు, బస్సులు పరిగెడుతున్నాయని ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) అన్నారు. శనివారం నాడు అనకాపల్లి జిల్లాలో ‘మేముసిద్ధం’సభలో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలు చూసి టీడీపీ అధినేత చంద్రబాబు భయపడి తన మీద రాళ్లు వేయమంటున్నారని అన్నారు. తనను ఈ ఎన్నికల్లో ఓడించడానికి, చంద్రబాబు, ఆయన బినామీల సొమ్మును దాచుకోవాటానికి తెలుగుదేశం - జనసేన- బీజేపీ కూటమికి అధికారం కావాలని అడుగుతున్నారని అన్నారు.
Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి
ఈ మధ్య చంద్రబాబు తను గురించి మాట్లాడుతూ.. ‘జగన్ ఒక బచ్చా’ అని అన్నారని చెప్పారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, విలన్లు అందరికీ కూడా, హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తారని ఎద్దేవా చేశారు. ఒంటరిగా వస్తున్న తనను చూసి భయపడి... చంద్రబాబు పొత్తుల కోసం ఎగబడుతున్నారని ఎద్దేవా చేశారు. తాను ఒకే ఒక్కడిని సింగిల్‌గా వస్తున్నానని.. తనను ఎదుర్కొనేందుకు ఇంతమంది ఏకమవుతున్నారని అన్నారు. తాను బచ్చానే అయితే.. తన చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయి 23 మంది ఎమ్మెల్యేలు గెలుచుకున్న చంద్రబాబును ఏమనాలని ప్రశ్నించారు. తాను బచ్చానే అయితే ఒంటరిగా రావడానికి చంద్రబాబు ఎందుకు భయపడ్డారని నిలదీశారు.
Lokesh: జగన్ రెడ్డి గారి జమానాలో నిజాలు చెప్పడమే నేరమా?!
తాను బచ్చా అయితే ఐదేళ్ల తర్వాత కూడా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అరడజన్ మందిని వెంట వేసుకుని వస్తున్నా.. చంద్రబాబును ఏమనాలి అని నిలదీశారు. తాను ఐదేళ్లు చేసింది.. చంద్రబాబు 14 ఏళ్లయినా ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఈ బచ్చా చేసిన పనిని ఆయన ఎందుకు చేయలేకపోయావని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏం చెబుతున్నానో... చంద్రబాబు ఏం చెబుతున్నారో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది... వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలేనని ఆరోపించారు. ఈ ఎన్నికలు పేదల భవిష్యత్తును మార్చే ఎన్నికలని తెలిపారు. తాను అధికారంలో ఉంటేనే పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీ మళ్లీ అంధకారమే అవుతుందని చెప్పారు. రూ. 2.70 లక్షల కోట్ల రూపాయలు, బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో వేశానని సీఎం జగన్ గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
Atchannaidu: గులకరాయి డ్రామాకు దర్శకత్వం వహించినవారికి తగిన రీతిలో సన్మానం... అచ్చెన్న వార్నింగ్
AP Elections: మంత్రి కాకాణి ఇలాకాలో భారీగా మద్యం డంప్... అధికారులు వెళ్లి చూడగా..!
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 20 , 2024 | 07:51 PM