ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan Nomination: నేడు నామినేషన్ వేయనున్న సీఎం జగన్..

ABN, Publish Date - Apr 25 , 2024 | 09:32 AM

అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు(Assembly Elections) ఇవాళే చివరి రోజు కావడంతో.. చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. గురువారం నాడు పులివెందులలో(Pulivendula) వైసీపీ అభ్యర్థిగా(YSRCP Candidate) ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నామినేషన్(YS Jagan Nomination) దాఖలు చేయనున్నారు.

CM YS Jagan Nomination

కడప, ఏప్రిల్ 25: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు(Assembly Elections) ఇవాళే చివరి రోజు కావడంతో.. చాలా మంది నేతలు ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. గురువారం నాడు పులివెందులలో(Pulivendula) వైసీపీ అభ్యర్థిగా(YSRCP Candidate) ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నామినేషన్(YS Jagan Nomination) దాఖలు చేయనున్నారు. ఉదయం 11.25 గంటల నుంచి 11.45 లోపు ఆర్డీవో కార్యాలయంలో ఆర్వోకు నామినేషన్ అందజేయనున్నారు జగన్. దానికంటే ముందు పులివెందులలోని సీఎస్ఐ గ్రౌండ్‌లో జగన్ భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ప్రజలనుద్దేశించి ఈ సభలో ప్రసంగిస్తారు.


దస్తగిరి కూడా..

మరో వైపు పులివెందుల ఎమ్మెల్యేగా జైభీమ్ పార్టీ అభ్యర్థిగా దస్తగిరి నామినేషన్ దాఖలు చేయనున్నాడు. వివేకాహత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ దస్తగిరి ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా పోటీకి సై అన్నారు. దస్తగిరి నామినేషన్ కార్యక్రమానికి జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రణ్ కుమార్ హాజరవుతున్నారు. కాగా, జగన్ నామినేషన్ కార్యక్రమం ఉండటంతో.. దస్తగిరికి ఉదయం అనుమతి నిరాకరించారు పోలీసులు. జగన్ పులివెందుల నుంచి వెళ్లాక మధ్యాహ్నం 2 గంటల తరువాత నామినేషన్ వేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఇదికూడా చదవండి: హమ్మయ్య.. ఊరటనిచ్చిన బంగారం, వెండి ధరలు.. నేడు రేట్లు ఇవీ..


పోలింగ్ ఎప్పుడంటే..

ఏప్రిల్ 18వ తేదీన మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. ఏప్రిల్ 25వ తేదీతో ముగియనుంది. 26వ తేదీన రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల పరిశీలన చేస్తారు. 29వ తేదీ వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. మే 13వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 4 తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలను వెల్లడిస్తారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2024 | 09:32 AM

Advertising
Advertising