Tulasireddy: జగన్ రెడ్డి కాదు - జలగ రెడ్డి
ABN, Publish Date - Apr 17 , 2024 | 10:59 AM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి కాదు - జలగ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ది వాతల, మోతల, కూతల, కోతల ప్రభుత్వమంటూ మండిపడ్డారు. జగన్ పాలనలో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ తగులుతోందని.. ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందన్నారు.
అమరావతి, ఏప్రిల్ 17: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై (CM Jaganmohan Reddy) పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి (Congress Leader Tulasi Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ రెడ్డి కాదు - జలగ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. జగన్ ది వాతల, మోతల, కూతల, కోతల ప్రభుత్వమంటూ మండిపడ్డారు. జగన్ పాలనలో కరెంటు బిల్లు ముట్టుకుంటేనే షాక్ తగులుతోందని.. ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచిందన్నారు. ప్రజలకు మట్టి ముంత ఇచ్చి వారి నుంచి వెండి చెంబు దొంగలించినట్లుంది జగన్ పాలన అంటూ దుయ్యబట్టారు.
AP Politics: జగన్.. ఇక నీ ఆటలు సాగవు.. బాలయ్య మాస్ వార్నింగ్..
జగన్ పాలనలో ఇల్లు పిచ్చుక గూళ్ళన్నారు. పులివెందుల పట్టణంలో మంజూరు చేసిన ఇళ్లు 7079 అని... పూర్తి అయినవి 310 కాగా.. చేరినవి మాత్రం సున్నా అని.. ఇదీ జగన్ అద్భుతమైన పాలన! అంటూ సెటైర్ విసిరారు. నమ్మించి మోసగించడం జగన్ నైజమన్నారు. ఏరుదాటినంత వరకు ఓడ మల్లన్న - దాటాక బోడి మల్లన్న అనడం జగన్‌కు పరిపాటన్నారు. మళ్ళీ మోసాగించాలని చూస్తున్నారని... మోసపోవద్దంటూ ప్రజలకు కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ రాజ్యం, రాజన్న రాజ్యం కాంగ్రెస్‌తోనే సాధ్యమని తులసిరెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
AP Politics: ఆహా.. ఏం చెప్పారు జగన్ గారూ..!
YCP: రాళ్ల దాడి ఘటనలో బోండా ఉమ టార్గెట్‌గా పావులు కదుపుతున్న వైసీపీ..!
మరిన్ని ఏపీ వార్తల కోసం...
Updated Date - Apr 17 , 2024 | 11:32 AM