AP Election 2024:మోదీని సాగనంపాల్సిన సమయం వచ్చింది: డి.రాజా
ABN, Publish Date - May 10 , 2024 | 09:56 PM
పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజా ప్రసంగించారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు.
విజయవాడ: పదేళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ ఏపీకి ఏం చేశారో చెప్పాలని సీపీఐ (CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా (D.Raja) ప్రశ్నించారు. జింఖానా గ్రౌండ్ లో ఇండియా కూటమి ఆధ్వర్యం శుక్రవారం భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాజా ప్రసంగించారు. దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తి అయ్యిందని తెలిపారు. ఏపీ, బీహార్, బెంగాల్, ఇతర రాష్ట్రాల్లో పోలింగ్ జరగాల్సి ఉందని చెప్పారు. సెక్యూలర్ డెమెక్రటిక్ పార్టీలన్నీ ప్రజల కోసం, దేశం కోసం కలిసి ఇండియా కూటమిగా ఎన్నికల్లో దిగాయని చెప్పుకొచ్చారు. బీజేపీతో పాటు కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
AP Election 2024: వైసీపీ కోసం.. లూప్‌లైన్ ‘వ్యూహం’
ఏపీలో మోదీతో జత కట్టిన టీడీపీ, జనసేనలను ఓడించాలని అన్నారు. వైసీపీకి ఓటు వేసినా కూడా ఏపీలో మోదీకి వేసినట్లేననేది వాస్తవమన్నారు. రాష్ట్ర అభివృద్ది కోరుకునే వారు ఎవరైనా ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.మోదీ ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారని.. ఎంత మోసం చేశారో ఆలోచించాలని అన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పుడు 20కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటున్న మోదీని ప్రజలు ప్రశ్నించాలని అన్నారు. మోదీ ప్రభుత్వంలో గ్యాస్, పెట్రో, నిత్యావసర వస్తులు ధరలు ఎంతో పెరిగాయని అన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారని... నేడు రైతుల దుస్థితి ఎలా ఉందో చూస్తున్నామన్నారు. కనీస మద్దతు ధర కూడా అందక అన్నదాతలు అల్లాడుతున్నారని చెప్పారు. దేశంలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని వర్గాల ప్రజలను మోదీ మోసం చేశారని ధ్వజమెత్తారు. డీమోనటైజేషన్ ద్వారా ఏం సాధించారని.. బ్లాక్ మనీ ఎందుకు వెలికి తీయలేదని ప్రశ్నించారు. ఏపీని అన్ని విధాలా మోసం చేసిన మోదీని సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా ఆలోచించి కాంగ్రెస్, వాపక్ష పార్టీల అభ్యర్థులను గెలిపించాలని డి. రాజా కోరారు.
AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే
Read Latest AP News And Telugu News
Updated Date - May 10 , 2024 | 10:01 PM