ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: పాలకొండ అసెంబ్లీ ఆర్‌వోను తక్షణం బదిలీ చేయండి.. ఈసీ ఆదేశం

ABN, Publish Date - Apr 23 , 2024 | 11:46 AM

Andhrapradesh: ఎన్నికల వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మరో ఐఏఎస్ అధికారినిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పనా కుమారిని..

EC order to transfer another IAS officer

అమరావతి, ఏప్రిల్ 23: ఎన్నికల (AP Elections 2024) వేళ నిస్పక్షపాతంగా వ్యవహరించని అధికారుల పట్ల ఎన్నికల సంఘం (Election Commission) కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వాలంటీర్లతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. వీరంతా ఎన్నికల విధుల్లో ఉండకూడదంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మరో ఐఏఎస్ అధికారినిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేసింది. సీతమ్మపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, పాలకొండ అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ కల్పనా కుమారిని తక్షణం బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

Accident: ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. నలుగురు మృతి, 25 మందికి గాయాలు


తక్షణం ఆమె తన కిందిస్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి విధుల నుంచి తప్పుకోవాలని సూచించింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎటువంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తక్షణం ఆ స్థానంలో ప్యానల్‌ను తీసుకుని వేరొక అధికారులు నియమించాలని ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఈసీఐ సమాచారం పంపింది.


చిత్తూరు పోలీస్‌ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ బదిలీ...

అలాగే చిత్తూరు పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎం గంగిరెడ్డిని కూడా బదిలీ చేయాలంట ఈసీఐ ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను చిత్తూరు జిల్లా వెలుతులకు బదిలీ చేయడంతో పాటు పోలీస్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేయాలని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించింది. అలాగే అతని స్థానంలో ప్యానల్ నుంచి ఎంపిక చేసిన వ్యక్తిని నియమించాలని ఈసీఐ సూచించింది.


ఇవి కూడా చదవండి...

Venkaiahnaidu: ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను

YSRCP: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 23 , 2024 | 12:07 PM

Advertising
Advertising