AP Elections: వైసీపీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఎన్నికల సంఘం...
ABN, Publish Date - Apr 13 , 2024 | 11:48 AM
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ‘‘మేమంతా సిద్ధం’’ పేరిట బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రమంతటా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో సీఎం ప్రచారం నిర్వహించారు. అయితే బస్సు యాత్ర సందర్భంగా తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం... అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది.
విజయవాడ, ఏప్రిల్ 13: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan Reddy) ప్రచారంలో దూకుడు పెంచారు. ‘‘మేమంతా సిద్ధం’’ (Memantha Siddam) పేరిట బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రమంతటా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో సీఎం ప్రచారం నిర్వహించారు. అయితే బస్సు యాత్ర సందర్భంగా తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం... అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది.
Kishan Reddy: బీఆర్ఎస్కు ఓటేస్తే.. మూసీ నదిలో వేసినట్టే...
‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్రలో భాగంగా జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలు ఈసీ తొలగించేసింది. ఎమ్‌సీసీ పర్యవేక్షణ అధికారి రహీం నేతృత్వంలో తాడేపల్లి, విజయవాడ మధ్య కృష్ణా వారధిపై ఏర్పాటు చేసిన జెండాలను తొలగించారు. వారధికి రెండు వైపులా ఏర్పాటు చేసిన బ్యానర్లు తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది తీసివేసింది. కాగా.. ఈరోజు (శనివారం) తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో వారధి వద్ద వైసీపీ శ్రేణులు చేసిన స్వాగత ఏర్పాట్లను ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు.
Rishabh Pant: అంపైర్‌తో రిషభ్ పంత్ గొడవ.. జరిమానా విధించాల్సిందేనా?
బస్సు యాత్ర ఇలా..
కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గత నెలలో ‘‘మేమంతా సిద్ధం’’ పేరుతో సీఎం జగన్ బస్సు యాత్రను మొదలుపెట్టారు. ‘‘సిద్ధం’’ సభలను నిర్వహించిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. మార్చి 27న ప్రారంభమైన బస్సు యాత్ర 21 రోజుల పాటు సాగనుంది. ఇడుపులపాయ నుంచి మొదలైన జగన్ బస్సు యాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగనుంది. మరోవైపు ముఖ్యమంత్రి బస్సు యాత్ర నేటితో 14వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం నంబూరు నుంచి యాత్ర మొదలైంది. మంగళగిరి నియోజకవర్గం మీదగా విజయవాడలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. మధ్యాహ్నం మంగళగిరి నియోజకవర్గ నేతలతో సీఎం జగన్ సమావేశంకానున్నారు.
ఇవి కూడా చదవండి..
Lok Sabha Elections:హైదరాబాద్ సీటుపై కాంగ్రెస్ నిర్ణయం అదేనా.. ?
Delhi Liquor Scam: ఢిల్లీకి వెళ్లనున్న కేటీఆర్.. కారణమిదేనా..?
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 13 , 2024 | 11:52 AM