AP Election Counting: మిగిలింది ఆర్రోజులే.. అభ్యర్థుల్లో పెరిగిన టెన్షన్..
ABN, Publish Date - May 29 , 2024 | 01:22 AM
కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే. ఈనెల 13 తేదీ నుంచి గూడుకట్టుకట్టుకున్న టెన్షన్ అంతా జూన్ 4వ తేదీతో పోతుంది. ఆరోజు అంటే మంగళవారం మధ్యాహ్నానికే ఇంచుమించు ఫలితాలన్నీ తేలి పోతాయి. జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాజమండ్రి సిటీ, రూర ల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడద వోలు, గోపాలపురం నియోజకవర్గాలలో మొత్తం 83 మంది అభ్యర్థులు వివిధ పార్టీల కింద, స్వతంత్రులుగానూ పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన పోటీ టీడీపీ- జనసేన- బీజేపీ కూట మి, వైసీపీ మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి..
దగ్గరపడిన కౌంటింగ్ సమయం
మంగళవారం మధ్యాహ్నానికే ఫలితాలు
అభ్యర్థుల్లో టెన్షన్.. ఎవరి ధీమా వారిది
జిల్లాలో 83 మంది జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తం
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి):
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు (AP Elections 2024) కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక కేవలం ఆరు రోజులు మాత్రమే. ఈనెల 13 తేదీ నుంచి గూడుకట్టుకట్టుకున్న టెన్షన్ అంతా జూన్ 4వ తేదీతో పోతుంది. ఆరోజు అంటే మంగళవారం మధ్యాహ్నానికే ఇంచుమించు ఫలితాలన్నీ తేలి పోతాయి. జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాజమండ్రి సిటీ, రూర ల్, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాలలో మొత్తం 83 మంది అభ్యర్థులు వివిధ పార్టీల కింద, స్వతంత్రులుగానూ పోటీచేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాన పోటీ టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి, వైసీపీ మధ్య ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూటమి గెలుస్తుందని, సైలెంట్ వేవ్ ఉందని అనేక సర్వేలు స్పష్టంచేస్తున్నాయి.
మరోపక్క అధికార వైసీపీ కూడా మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది. ఎవరి అంచనాలు వారికి ఉండడంతోపాటు ఎవరి ధీమా వారికే ఉంది. గెలిచేవారికీ భయం ఉంది. ఓడిపో తామనుకునేవారికి భయం ఉంది. ఈనెల 13వ తేదీన పోలింగ్ జరిగినప్పటి నుంచి అభ్యర్థులతోపాటు, సాధారణ ప్రజల్లో కూడా ఎవరు గెలుస్తారనే టెన్షన్ ఉంది. పోలింగ్ పూర్తికాగానే అభ్యర్థులు విశ్రాంతి పేరుతో విదేశాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కొంత టెన్షన్ తగ్గించుకోవడంతోపాటు ఎన్నికల ప్రచారంలో బడలిక కూడా తీర్చుకోవడానికి వారంతా వెళ్లారు. ఇప్పు డిప్పుడే తిరిగి అందరూ తమ స్థానాలకు వస్తున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను నియ మించుకోవడంలోనూ, బూత్‌ల వారీ పోలింగ్ అంచనాలు, తమకు వస్తాయను కునే ఓట్ల విషయంలోనూ ఇప్పటికే లెక్కలు కట్టుకున్నారు. కూటమి అభ్యర్థుల్లో ధీమా కనిపిస్తోంది. ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలతోపాటు, వివిధ వర్గాల ప్రజల నోట కూడా ఎక్కువగా కూటమి విజయం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క వైసీపీ కూడా గెలుస్తామనే ధీమాతో ఉంది. కాంగ్రెస్, ఇతర అభ్యర్థులు కూడా తమకు ఎన్ని ఓట్లు వస్తాయో, అవి ప్రధాన అభ్యర్థులకు ఎవరికి నష్టం తెస్తాయో అనే అంచనాల్లో ఉన్నారు. కనీసం పరువుదక్కేవిధంగా తమకు ఓట్లు వస్తాయా లేదా అనేవిధంగా కూడా ఆలోచించేవారూ లేకపోలేదు. ఇక రాజ మండ్రి లోక్‌సభ కూటమి బీజేపీ అభ్యర్థిని దగ్గుబాటి పురందేశ్వరికి కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినా, అనేకచోట్ల ఆమెకు ఆదరణ బాగా కనిపించినట్టు చెబుతున్నారు. ఆమెకు తిరుగులేని ఫలితాలు వస్తాయనే వాదన కూడా ఉంది.
అలాగే కూటమి టీడీపీ అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి (రాజమండ్రి రూరల్), ఆది రెడ్డి వాసు (రాజమండ్రి సిటీ), ముప్పిడి వెంకటేశ్వరరావు (కొవ్వూరు), మద్దిపాటి వెంకట్రాజు (గోపాలపురం), కూటమి జనసేన అభ్యర్థులు కందుల దుర్గేష్ (నిడ దవోలు), బత్తుల బలరామకృష్ణ (రాజానగరం)తోపాటు కూటమి బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (అనపర్తి) కూడా గెలుపు ధీమాతో ఉన్నారు. కానీ వైసీపీలో ఆ జోష్ కనిపించడం లేదు. వైసీపీ నుంచి రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమండ్రి సిటీ అభ్యర్థిగా మార్గాని భరత్, రూరల్ నుంచి చెల్లుబోయిన వేణు, రాజానగరం నుంచి జక్కంపూడి రాజా, అనపర్తి నుంచి డాక్టర్ కె.సూర్యనారాయణరెడ్డి, కొవ్వూరు నుంచి తలారి వెంక ట్రావు, నిడదవోలు నుంచి జి.శ్రీనివాసనాయుడు, గోపాలపురం నుంచి తానేటి వనిత పోటీపడిన సంగతి తెలిసిందే. మరోవైపు జిల్లాలో ఎన్నికల ఫలితాలపై పందాలు జోరు పెరిగింది. కానీ టీడీపీ గెలుస్తుందని బెట్టింగ్‌రాయుళ్లు ముందుకు వస్తున్నా వైసీపీ వైపు పందాలు కట్టేవారే కరువయ్యారని చెబుతున్నారు.
Updated Date - May 29 , 2024 | 08:51 AM