ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Exit Polls: ఏపీ ఎన్నికల్లో కాదు.. ‘ఎగ్జిట్‌ పోల్స్‌’లో గెలవాలి!

ABN, Publish Date - May 30 , 2024 | 02:13 AM

జూన్‌ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్‌ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది.

  • పెయిడ్‌ ఏజెన్సీలతో వైసీపీ నేతల సంప్రదింపులు!

  • సర్వేలు అనుకూలంగా ఉండేలా ప్లాన్‌

అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): జూన్‌ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్‌ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. ఆ ఎగ్జిట్‌ పోల్స్‌పై రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నేతలు వీటిపై ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు ప్రారంభించారు. ఆ రోజు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు తమకు వ్యతిరేకంగా వెలువడతాయేమోనన్న అనుమానం వారిలో ఉంది. ఇవి ఏకపక్షంగా తమకు వ్యతిరేకంగా ఇస్తే పార్టీ శ్రేణులు డీలా పడి జారిపోతారని, ఓట్ల లెక్కింపు రోజున కూడా నామమాత్రంగా పాల్గొనే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులు కూడా తమకు సహకరించరేమోనన్న భయం కూడా ఉంది. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌లో కొన్ని తమకు అనుకూలంగా ఫలితాలు ఇచ్చేలా చూసుకోవడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఏడెనిమిది సర్వే సంస్థలు ఆ రోజు ఎగ్జిట్‌ పోల్స్‌ను ఇస్తుంటాయి.

ఈ జాబితాలో తమకు అనుకూలంగా చెప్పేవారు ఇద్దరు ముగ్గురు ఉంటే ఇబ్బంది ఉండదని అధికార పార్టీనేతలు భావిస్తున్నారు. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని చిన్న సర్వే సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారని వినవస్తోంది. జాతీయ స్థాయిలో ఎలాంటి ఫలితాలు ఇచ్చినా ఇబ్బంది లేదని, ఏపీ వరకూ మాత్రం వైసీపీ (YSR Congress) గెలవబోతోందని చెబితేచాలని వారితో బేరా లు జరుపుతున్నారని అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఒకరిద్దరు సర్వే సంస్థల నిర్వాహకులను కూడా వారు సంప్రదించినట్లు సమాచారం. ఇందులో ఒక సర్వే సంస్థ నిర్వాహకుడు ఇప్పటికే తన డీల్‌ ఖరారు చేసుకొన్నట్లు చెబుతున్నారు. జూన్‌ 1న సాయంత్రం ఏడు గంటలకు తాను ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు విడుదల చేయబోతున్నానని, వైసీపీ అనుకూలంగా తమ సర్వే వచ్చిందని ఆ నిర్వాహకుడు ఇప్పటికే లీకులు ఇస్తుండడం గమనార్హం!

Updated Date - May 30 , 2024 | 10:04 AM

Advertising
Advertising