ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: అందుకే బీజేపీ జగన్‌ను వదిలేసింది: గోనె ప్రకాష్ రావు

ABN, Publish Date - May 08 , 2024 | 05:20 PM

ఏపీలో తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) జోస్యం చెప్పారు. జగన్ వై నాట్ 175 అన్నాడు..అలాంటప్పుడు ఇతరులను వేరే చోటు నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు.

Gone Prakash Rao

ఢిల్లీ: ఏపీలో తెలుగుదేశం పార్టీ - జనసేన- బీజేపీ కూటమి 145 అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) జోస్యం చెప్పారు. సీఎం జగన్ (CM Jagan) ఈ ఎన్నికల్లో వై నాట్ 175 అంటున్నాడని.. అలాంటప్పుడు తన పార్టీ అభ్యర్థులను వేర్వేరు చోట్ల నుంచి ఎందుకు పోటీకి నిలబెట్టారని ప్రశ్నించారు. కూటమి పొత్తు వల్ల టీడీపీకి కొంత నష్టం జరిగిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతుందని చెప్పారు. బీజేపీ జగన్ ను వదిలేసిందని అంటే.. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నాడని అర్థమని అన్నారు.


Rahul Gandhi: ఈనెల 11న కడపకు రాహుల్ గాంధీ.. ఎందుకంటే?

జగన్ తన చెల్లి(షర్మిల)ని వదిలేశాడు, బాబాయిని చంపాడని విరుచుకుపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కుటుంబాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఇబ్బందులకు గురి చేయలేదా అని ప్రశ్నించారు. సొంత చెల్లెను వదిలేసిన జగన్.. ఇతరులను చెల్లెలు అని అంటున్నారని ఎద్దేవా చేశారు. బొత్స సత్యనారాయణను జగన్ తండ్రితో సమానం అంటున్నాడని.. జగన్ కు అసలు సిగ్గుందా అని ఎద్దేవా చేశారు. మంత్రి రోజా రాజశేఖర్ రెడ్డిని ఇష్టానుసారంగా తిట్టలేదా అని ప్రశ్నించారు.


దేశంలోనే వైసీపీ అవినీతి ప్రభుత్వమని ఆరోపించారు. 100 కోట్ల రూపాయలు లిక్కర్, ఇసుక, మైనింగ్ లో జగన్ సంపాదించారని విమర్శించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి లేదు , ఒక్క రాజధాని లేదని మండిపడ్డారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ రిజర్వేషన్ అంశాన్ని ముట్టుకోదని, బ్రిటిష్ చట్టాలను మార్చే అవకాశం ఉందని అన్నారు. రాజ్యాంగ సవరణ ఉంటుంది, అందులో రిజర్వేషన్ అంశం ఉండదని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు.

AP News: ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 08 , 2024 | 07:51 PM

Advertising
Advertising