AP Politics: బయటపడుతున్న జగన్ కుట్రలు.. ఛీ కొడుతున్న జనం..
ABN, Publish Date - May 03 , 2024 | 02:14 PM
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో.. ప్రజల మూడ్‌ను మార్చేందుకు జగన్ అండ్ కో అనేక కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు జగన్ గెలవడంతో పాటు.. మరోవైపు విపక్షంలో కీలక నేతలను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది.
ఎన్నికల్లో గెలిచేందుకు వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. జగన్ ఐదేళ్ల పాలనపై ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉండటంతో.. ప్రజల మూడ్‌ను మార్చేందుకు జగన్ అండ్ కో అనేక కుట్రలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓ వైపు జగన్ గెలవడంతో పాటు.. మరోవైపు విపక్షంలో కీలక నేతలను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ కుట్రలు చేస్తున్న విషయం బయటకు వచ్చింది.
ఎన్నికల్లో ఎవరైనా ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వొచ్చు.. ఆ పార్టీ తరపున ప్రచారం చేయ్యొచ్చు. ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవల్సి ఉంటుంది. కానీ ఒకరిని ఓడించడం కోసం వైసీపీ అధినేత జగన్ కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి భారతి విడుదల చేసిన ఓ వీడియో జగన్ ఎలాంటి కుట్రలకు పాల్పడుతున్నారో స్పష్టం చేస్తోంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు ముద్రగడను జగన్ ఓ పావులా వాడుకుంటున్నారనే విషయం ఆయన కుమార్తె ద్వారా తెలిసింది. ఏదో ఆశించి జగన్‌కు ముద్రగడ సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు పవన్ కళ్యాణ్‌పై అనేక విమర్శలు చేసిన ముద్రగడ పద్మనాభం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో అక్కడ ఆయనను ఓడించే బాధ్యతలను ముద్రగడకు జగన్ అప్పగించారు. మరోవైపు ముద్రగడ నిర్ణయాన్ని కాపులంతా వ్యతిరేకిస్తూ వచ్చారు. జగన్ ప్యాకేజీకి ముద్రగడ అమ్ముడుపోయారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. తాజాగా ముద్రగడ కుమార్తె వీడియో బయటకు రావడంతో పద్మనాభం అసలు రూపం బయటపడింది. అంతేకాదు ఓట్లకోసం జగన్ ఇలాంటి ఎన్నో కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. దీనిలో రాయి దాడి ఒక భాగంగానే తెలుస్తోంది.
20 లక్షల ఉద్యోగాల కల్పన బాధ్యత నాది
కుటుంబాల్లో చిచ్చు..
రాజకీయాలు వేరు, కుటుబం బంధుత్వాలు వేరు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేర్వేరు రాజకీయపార్టీల్లో ఉండటం సహజం. కానీ రాజకీయ స్వప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య జగన్ చిచ్చుపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాపులంతా జనసేనకు మద్దతు ఇస్తున్న వేళ ప్రజల మైండ్ డైవర్షన్ కోసం ముద్రగడ పద్మనాభంతో పవన్ కళ్యాణ్‌ను తిట్టించడం, వైసీపీలో ముద్రగడను చేర్చుకోవడంతో పాటు.. చేగొండి హరిరామజోగయ్య కుమారుడిని వైసీపీలో చేర్చుకుని.. కాపు ఓటు బ్యాంకులో కొంతభాగాన్ని ఎన్డీయే కూటమికి దూరం చేయాలని జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. అది ఫలించలేదు. ఇలా ఈ రెండు విషయాల్లోనే కాదు చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలకు జగన్ పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి.
ముద్రగడ కుమార్తె వీడియోతో..
పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కే తమ మద్దతు ఉంటుందని ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి వీడియో విడుదల చేశారు. తన తండ్రి నిర్ణయంతో తాము విబేధిస్తున్నట్లు స్పష్టంచేశారు. జగన్‌తో చేతులు కలిపి పవన్ కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించకపోతే తాన పేరుకు రెడ్డిని తగిలించుకుంటానని సవాలు చేయడంపై క్రాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతగా దిగజారి ప్రవర్తించడం ఎందుకంటూ ప్రశ్నించారు. ఓ జాతిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి, సెంటిమెంట్‌తో ఓట్లు పొందేందుకు ముద్రగడతో ఆ ప్రకటన చేయించి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు మద్దతు పెరుగుతుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు సానుభూతి రాజకీయాలకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
ముద్రగడ కుమార్తె వీడియోతో జగన్ కుట్రలు ప్రజలకు తెలిసొస్తున్నాయని.. ఈ కుట్రలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది క్షేత్రస్థాయి పరిస్థితులనుబట్టి అర్థమవుతోంది. ఓట్ల కోసం ఇంత నీచానికి దిగజారడం అవసరమా అని ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. సానుభూతి రాజకీయాలు వర్కౌట్ అవుతాయని భావించిన వైసీపీకి ప్రస్తుతం గట్టి షాక్ తగలబోతుందని, వైసీపీ కుట్రలను పసిగట్టిన ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారనే అభిప్రాయం ఓటర్ల నుంచి వ్యక్తమవుతోంది. వైసీపీ కుట్రలు, సానుభూతి రాజకీయాలు వర్కౌట్ అవుతాయా లేదా అనేది జూన్ 4న తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read Latest AP News And Telugu News
Updated Date - May 03 , 2024 | 02:50 PM