ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: టీడీపీకి మద్దతు తెలుపుతున్న ముస్లిం సంఘాలు

ABN, Publish Date - May 09 , 2024 | 09:44 AM

Andhrapradesh: తెలుగు దేశం పార్టీకి ముస్లిం సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, చంద్రబాబు సీఎం అవ్వాలని ముస్లిం సంఘాల నేతలు కోరుతున్నారు. తాజాగా టీడీపీకి జమాత్ ఉలమ ఏ హింద్ పూర్తి మద్దతు తెలిపింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి భేటీ అయ్యారు.

TDP Chief Chandrababu Naidu

అమరావతి, మే 9: తెలుగు దేశం పార్టీకి (Telugu desham Party) ముస్లిం సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవాలని, చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) సీఎం అవ్వాలని ముస్లిం సంఘాల నేతలు కోరుతున్నారు. తాజాగా టీడీపీకి జమాత్ ఉలమ ఏ హింద్ (Jamaat Ulama A Hind) పూర్తి మద్దతు తెలిపింది. గురువారం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జమాత్ ఉలమ ఏ హింద్ జాతీయ అధ్యక్షులు మౌలానా సుహైబ్ ఖాసిమి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ మద్దతు టీడీపీకే అని స్పష్టం చేశారు. అనంతరం మైలానా సుహైబ్ ఖాసిమి మాట్లాడుతూ.. లౌకికవాదం, ప్రజాస్వామ్య విధానాలను చంద్రబాబు పాటిస్తారన్నారు. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దిన చరిత్ర చంద్రబాబుది అని కొనియాడారు.

Lok Sabha Polls: రిజర్వేషన్లపై రాద్దాంతం.. రాజ్యంగం ఏం చెబుతోంది..


ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. హజ్ హౌస్ లు, షాదీఖానాలు, ఉర్దూఘర్‌లు టీడీపీ నిర్మించిందని చెప్పుకొచ్చారు. దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, విదేశీ విద్య వంటి పథకాలను పేద ముస్లింలకు అందించారన్నారు. ఉర్దూని రెండో అధికార భాషగా ప్రకటించింది టీడీపీనే అని అన్నారు. కర్నూలులో డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారని.. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పెట్టింది టీడీపీనే అని తెలిపారు. అబ్దుల్ కలాంను భారత రాష్ట్రపతిని చేయడంతో చంద్రబాబు కీలక పాత్ర పోషించారన్నారు .దేశంలోనే మొదటిసారిగా ఇమామ్, మౌజనులకు గౌరవ వేతనాలను టీడీపీ అధినేత ఇచ్చారని మౌలానా సుహైబ్ ఖాసిమి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Andhra Pradesh : అప్పుల కుప్ప

Andhra Pradesh : కడప బాద్‌షా ఎవరో?

Read Latest AP News And Telugu News

Updated Date - May 09 , 2024 | 10:09 AM

Advertising
Advertising