AP Elections: స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: పీతల మూర్తి యాదవ్
ABN, Publish Date - May 08 , 2024 | 02:19 PM
Andhrapradesh: స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌కు ఓటు వేస్తే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే... ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
విశాఖపట్నం, మే 8: స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కోసం మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి (CM Jaganmohan Reddy) లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ (Janasena Leader Peetala Murthy yadav)అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్‌కు ఓటు వేస్తే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే... ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. ‘‘అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు 2019లో తిప్పల నాగిరెడ్డికి ప్రజలు ఓటేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్‌ను కాదని మరి వైసీపీ ప్రభుత్వం గెలిపించారు. మరి ఐదేళ్లు మీరు ఏం చేశారు. మీ వైసీపీ అభ్యర్థికే కదా ప్రజలు పట్టం కట్టారు. ఈ ఐదేళ్లలో ఏం చేశారు స్టీల్ ప్లాంట్ కోసం’’ అని నిలదీశారు.
AP Elections: ముద్రగడ మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు సుమారుగా 1000 రోజుల నుంచి నిరస దీక్ష చేస్తున్నారన్నారు. ఈ వెయ్యి రోజుల్లో ఎన్నిసార్లు విశాఖపట్నం వచ్చారు?.. ఒక్కసారైనా కార్మికులు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం ప్రకటించారా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులతో మాట్లాడారా? అని నిలదీస్తూ.. కనీసం పక్కనే ఉన్న కార్మికుల శిబిరంలోకి వచ్చి సంఘీభావం ప్రకటించలేదని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ మీద ఇంత చిత్తశుద్ధి ఉన్న జగన్... గంగవరం పోర్ట్‌లో ప్రభుత్వ వాటా 10. 24% ఎందుకు అమ్మేశారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌కు అనుబంధం గంగవరం పోర్ట్ అని... ఈరోజు ఆలాంటి పోర్ట్‌లో బొగ్గునిల్వలు స్టీల్ ప్లాంట్‌కు చేరక స్టీల్ ప్లాంట్ ఆపే పరిస్థితి వచ్చిందన్నారు.
AP Elections: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలనం.. ఏమన్నారంటే..?
అంతటి కీలకమైన గంగవరం పోర్టును ఎందుకు విక్రయించారని ప్రశ్నించారు. ఈ ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ దగ్గరికి వెళ్లి ఎన్నిసార్లు కలిశారని అడిగారు. ఎన్నిసార్లు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అవకాశం వచ్చింది అంటూ జగన్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘వంగి వంగి నమస్కారాలు పెట్టి మీరు... ఈ రోజున ప్రధాని మోదీని విమర్శిస్తున్నారు. రెండు నాలుక ధోరణి అంటున్నారు. అసలు రెండు నాలుక ధోరణ అంటే మీది... సొంత బాబాయ్ హత్య జరిగితే హత్యని తెలిసి కూడా గుండెపోటు నాటకమాడారు’’ అంటూ పీతల మూర్తి యాదవ్ విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: ముద్రగడ మరో సంచలనం.. ఈసారి ఏకంగా..!
Narendra Modi: రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో తర్వాత అర్థమైంది
Read Latest AP News And Telugu News
Updated Date - May 08 , 2024 | 03:14 PM