AP Elections: తొలిప్రేమ తర్వాత ఘన విజయం.. పవన్ వంద శాతం సక్సెస్ రేట్..
ABN, Publish Date - Jun 04 , 2024 | 08:10 PM
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో.
పవన్ కళ్యాణ్.. నిన్నటి వరకు నిలకడ లేని మనిషి.. సరైన ఆలోచన లేని నాయకుడు.. రాజకీయాల్లో రాణించలేడంటూ మాటలు పడ్డ వ్యక్తి.. అది గతం.. ప్రస్తుతం సీన్ మారింది. నేడు ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ రియల్ హీరో. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం నిలబడిన వ్యక్తి.. ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం పోరాడిన వ్యక్తి.. నిన్నటివరకు హేళన చేసిన నాయకులే ఆయన రాజకీయ చాతుర్యానికి జై కొడుతున్న పరిస్థితి. ఎంతోమంది ఎన్ని విమర్శలు చేసినా కుంగిపోకుండా ముందుకు సాగిన నాయకుడు పవన్ కళ్యాణ్. 175 అసెంబ్లీ స్థానాలున్న ఏపీలో జనసేన 21 స్థానాల్లో పోటీచేసింది. పవన్ కళ్యాణ్ తక్కువ సీట్లు తీసుకున్నారంటూ ఎంతోమంది ఎగతాళి చేసినా.. రాష్ట్రభవిష్యత్తు కంటే తనకు ఎమ్మెల్యే సీట్లు ముఖ్యం కాదంటూ అన్ని విమర్శలను తిప్పికొట్టారు. జనసేన 21 స్థానాల్లో కనీసం 10 కూడా గెలవదంటూ వైసీపీ హేళన చేసింది. పవన్‌కళ్యాణ్‌ను పిఠాపురంలో ఓడించేందుకు ఎన్నో కుట్రలు పన్నారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం తన లక్ష్యం కోసం ముందుకు కదిలారు. దీంతో వైసీపీకి ఏపీలో నామరూపాలు లేకుండా చేయడంలో పవన్ కళ్యాణ్ కీలకపాత్ర పోషించారు.
AP Election Result 2024 Live Updates: టెన్షన్ టెన్షన్.. ఏపీ అసెంబ్లీ కౌంటింగ్ లైవ్ అప్‌డేట్స్
వంద శాతం సక్సెస్ రేట్..
అసెంబ్లీలో అడుగుపెట్టలేవంటూ పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నాయకులు విమర్శించారు. జనసేనకు రాజకీయ భవిష్యత్తు లేదంటూ ఎగతాళి చేశారు. అయితే తాను అసెంబ్లీలో అడుగుపెట్టి తీరుతానని.. ప్రజల కోసం మరింత ఉత్సాహంగా పోరాడానంటూ పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూ వచ్చారు. ఈ విషయంలో ప్రజలను పవన్ కళ్యాణ్ కన్వెన్స్ చేశారన్నది ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి.
తొలిప్రేమ తర్వాత..
జీవితంలో తాను ఎక్కువుగా విజయాలను చూడలేదని.. తొలిప్రేమ తర్వాత విజయాలను చూసిన దాఖలాలు లేవంటూ పలు రాజకీయ సభల్లోనూ ప్రసంగిస్తూ వచ్చారు. ఈ విషయం ప్రజలను బాగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. జనసేన పోటీచేస్తున్న అన్ని స్థానాల్లో గెలిపించాలంటూ ప్రజలను కోరారు. పవన్ కళ్యాణ్ కోరికను ఏపీ ప్రజలు నెరవేర్చారు. 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులను గెలిపించారు. దీంతో తొలిప్రేమ తర్వాత తాను చూసిన అతిపెద్ద విజయమంటూ పవన్ కళ్యాణ్ ఫలితాల తర్వాత పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పోటీచేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి వందశాతం సక్సెస్ రేటుతో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోనూ పవర్‌స్టార్ అని నిరూపించుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Lok Sabha Election Results 2024 Live Updates: దేశ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రారంభం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 04 , 2024 | 08:10 PM