ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan Properties: పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా..!

ABN, Publish Date - Apr 23 , 2024 | 03:59 PM

Pawan Kalyan Election Nomination: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే(Tollywood) కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ(AP Politics) పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక సంచలనంగా చెప్పొచ్చు. సినీ నటుడిగా.. రాజకీయంగా.. ప్రజా సేవకుడిగా, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా ప్రజలందరి మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో..

Pawan Kalyan Properties

Pawan Kalyan Election Nomination: తెలుగు సినీ ఇండస్ట్రీలోనే(Tollywood) కాదు.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ(AP Politics) పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక సంచలనంగా చెప్పొచ్చు. సినీ నటుడిగా.. రాజకీయంగా.. ప్రజా సేవకుడిగా, ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడిగా ప్రజలందరి మన్ననలు, ఆదరాభిమానాలు పొందుతున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం(Pithapuram) ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల నామినేషన్‌ను మంగళవారం నాడు దాఖలు చేశారు పపన్. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులకు సంబంధించి కీలక వివరాలు పొందుపర్చారు. ఆ వివరాలేంటో ఈ కథనంలో మనం తెలుసుకుందాం..

ఇదికూడా చదవండి: ఫొటోకు ఫోజులిస్తూ అగ్నిపర్వతంలో పడిపోయిన టూరిస్ట్.. ఎక్కడంటే.?


అధికారిక సమాచారం ప్రకారం.. పవన్ కల్యాణ్ ఐదేళ్ల సంపాదన రూ. 114.76 కోట్లు. ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లు. ప్రజలకు, చారిటీలకు అందజేసిన విరాళాలు రూ. 20 కోట్లు. పవన్ కల్యాణ్ అప్పులు రూ. 64.26 కోట్లు. ఆదాయ పన్నుగా రూ. 47 కోట్లు, జీఎస్టీకి రూ. 5 కోట్లు చెల్లించారు. అప్పుల్లో వివిధ బ్యాంకుల నుంచి రూ. 17.56 కోట్లు తీసుకోగా.. వ్యక్తుల వద్ద నుంచి తీసుకున్నవి రూ. 46 లక్షల అప్పు ఉన్నాయి.

ఇదికూడా చదవండి: రాహుల్ గాంధీపై షాకింగ్ కామెంట్స్ చేసిన కేంద్ర మంత్రి..


గెలుపు కూటమిదే..

పవన్ కల్యాణ్ మంగళవారం నాడు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ప్రజలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేశారు. ఐదేళ్ల అరాచక ప్రభుత్వానికి చరమగీతం పడేలా నామినేషన్ వేశానని అన్నారు. ప్రజలు ఆశీర్వాదించారని.. ఎన్నికల్లో గెలుపు ఖాయం అన్నారు. ఈ ఎన్నికల్లో 2047 తరానికి చాలా కీలకం అని పేర్కొన్నారు. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే జనసేన తగ్గిందని.. బలమైన నేతల త్యాగాలు సైతం తప్పలేదన్నారు. 30 చోట్ల తమ అభ్యర్థులను విత్‌డ్రా చేయమని చెప్పినట్లు పవన్ తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వర్మ తన సీటును త్యాగం చేశారన్నారు. వర్మకు రానున్న కాలంలో మంచి స్థానం వచ్చేలా ప్రయత్నిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవబోతోందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.

For More Latest AP News and Telugu News..

Updated Date - Apr 23 , 2024 | 03:59 PM

Advertising
Advertising