ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ambati Rambabu: పల్నాడు హింసాత్మక ఘటనలపై సీఈవోకు మంత్రి అంబటి ఫిర్యాదు

ABN, Publish Date - May 14 , 2024 | 04:41 PM

Andhrapradesh: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనాకు మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు.

Minister Ambati Rambabu

అమరావతి, మే 14: పల్నాడులో హింసాత్మక ఘటనలపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్‌ మీనాకు(CEO Mukesh Kumar Meena) మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పల్నాడులో చాలా చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. గతంలో ఎన్నడూ జరగనంత అధ్వాన్నంగా పల్నాడులో ఎన్నికలు జరిగాయని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. అభ్యర్థులను తిరగొద్దని చెబితే.. తాను వెళ్లిపోయాను.. కానీ తన ప్రత్యర్థి మాత్రం యధేచ్ఛగా తిరిగారన్నారు. నార్నేపాడు, దమ్మాలపాడు, చీమల మర్రి గ్రామాల్లోని ఆరు బూత్‌లలో బూత్ క్యాప్చరింగ్ జరిగిందన్నారు. ఈ ఆరు బూత్‌లలోని పీఓ రిపోర్ట్ కాకుండా వెబ్ కెమెరాలను పరిశీలించాలని కోరారు. ఈ ఆరు బూత్‌లలో రీ-పోలింగ్ నిర్వహించాలని కోరినట్లు తెలిపారు.

India-America: భారత్‌కు అమెరికా వార్నింగ్.. ఆ ఒప్పందం కుదిరిన గంటల్లోనే..


కొత్తగణేషం పాడు గ్రామంలో టీడీపీ దాడులు చేస్తోందని.. మగవాళ్లంతా ఊరు విడిచి వెళ్లిపోయారన్నారు. గుళ్లల్లో దాక్కున్న మహిళల మీద దాడులు చేస్తున్నారని తెలిపారు. వాళ్ల వద్దకు వెళ్తోన్న కాసు మహేష్, అనిల్ యాదవ్ వంటి వాళ్లపైనా దాడులు చేశారన్నారు. పల్నాడంతా అరాచకంగా ఉందని తెలిపారు. పల్నాడులో రఫ్ కల్చర్ ఉంటుందని.. కానీ ఈసారి ఇంత రఫ్‌గా ఎప్పుడు ఎన్నికలు జరగలేదన్నారు. ‘‘నా రికమెండేష‌న్‌తో వేసిన ఎస్ఐ, సీఐలు ప్రత్యర్థులకు అమ్ముడుపోయారు.. ఎవరేం చేయగలరు..? పల్నాడు పుట్టిన తర్వాత ఇంతటి అరాచకం ఎప్పుడూ జరగలేదు. పల్నాడులో గతంలో కూడా గొడవలు జరిగిన చరిత్ర ఉంది గొడవలు జరగవని ఎప్పుడూ నేను చెప్పలేదు’’ అని మంత్రి అన్నారు.

AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్..


స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు బోండా, బుద్దా వెంకన్న కారుపై దుంగలతో దాడి జరిగిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా.. జరిగిన మాట వాస్తవమే అని మంత్రి అంగీకరించారు. గత ఎన్నికల్లో స్థానికేతరులు నియోజకవర్గంలో ఉంటే లాడ్జీల్లో కూడా వెతికి బయటకు పంపారని తెలిపారు. ఈసారి ఏంటో పల్నాడు మొత్తం ముఖ్యంగా సత్తెనపల్లిలో అంతా గుంటూరోల్లే ఉన్నారన్నారు. పోలీసులు వారిని ఎందుకు బయటకు పంపలేదని ప్రశ్నించారు. ఎందుకు పోలీసులు వారితో చేతులు కలిపారో అర్థం కావడం లేదన్నారు. గుంటూరు నుంచి రాడ్లు, కర్రలతో కారులో వచ్చినా ఎందుకు పోలీసులు వారిని అడ్డుకోలేదు అర్థం కావడం లేదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు షాక్.. మరోసారి తీవ్ర నిరాశ

AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 04:45 PM

Advertising
Advertising