Botsa: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?
ABN, Publish Date - Apr 18 , 2024 | 03:05 PM
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 18: ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) మాట ఇస్తే... మాట తప్పరు, మడమ తిప్పరని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Satyanarayana) మరోసారి స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధాని చేస్తానని సీఎం జగన్ అన్నారని.. మళ్ళీ గెలిచిన తర్వాత విశాఖలోనే (Visakhapatnam) ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెప్పారని తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ నిర్వహించామని.. పెట్టుబడులు వచ్చాయన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ విశాఖకు వచ్చిందని.. ఐటీ హబ్ కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశామని.. వన్‌ఇయర్‌లో భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తామన్నారు. ‘‘మాటలు కాదు, మాది చేతల ప్రభుత్వం’’ రాష్ట్రంలో పోర్టు, ఎయిర్‌పోర్ట్ పనులు పనులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని రాజకీయం చేయడం దారుణమని.. పేరెంట్స్ మీటింగ్ పెట్టకూడదా? అని ప్రశ్నించారు.
AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!
నాది 30 ఇయర్స్ ఇండస్ట్రీ...
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని.. ప్రైవేటీకరణ చేయమని బీజేపీతో కూటమి నేతలు చెప్పించాలని డిమాండ్ చేశారు. బొంబాయి, డిల్లీ, చెన్నై నగరాలను తలదన్నే విధంగా విశాఖను తయారు చేస్తామని చెప్పుకొచ్చారు. విశాఖలో పది వేల కోట్లతో అభివృద్ధి చేస్తే మరింత అభివృద్ధి అవుతుందని.. అదే అమరావతిలో పెడితే ఏం వస్తుంది? అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబుది 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయితే.. నాది 30 ఇయర్స్ ఇండస్ట్రీ’’ అని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు నేతల మీద ఎవరు దాడులు చేసినా అది సరికాదని.. దాడులను ఖండిస్తున్నామన్నారు.
Attack On Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్డేట్
మద్యపాన నిషేదంపై..
సంపూర్ణ మధ్యపాన నిషేధం చేస్తామని తాము అనలేదన్నారు. దశలు వారీగా మద్యపాన నిషేధం అమలు చేశామన్నారు. ధరలు పెంచి మద్య వినిమయం తగ్గించామని.. ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూడాలన్నారు. వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న మద్యంపై నాణ్యత పరీక్ష చేసుకొచ్చని.. అది నాసిరకమా కాదో తేలుతుందన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వాలు గ్యారెంటీగా పెట్టడం అనే ఈరోజు ఉన్న అంశం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
AP Elections: కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నామినేషన్
Attack On Jagan: జగన్‌పై రాయి దాడి కేసులో కీలక అప్డేట్
మరిన్ని ఏపీ వార్తల కోసం..
Updated Date - Apr 18 , 2024 | 03:40 PM