ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nara Brahmani: మహిళలను ఆదుకునేందుకే సూపర్ - 6 పథకాలు... ఎన్నికల ప్రచారంలో బ్రాహ్మణి

ABN, Publish Date - Apr 20 , 2024 | 02:44 PM

Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో బ్రహ్మణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపై మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించారు.

Nara Brahmani Election campaign

గుంటూరు, ఏప్రిల్ 20: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ (Mangalagiri TDP candidate Nara Lokesh) తరపున ఆయన సతీమణి నారా బ్రాహ్మణి (Nara Brahmini) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం, ఎర్రబాలెం గ్రామంలో మిర్చి కార్మికులతో బ్రహ్మణి భేటీ అయ్యారు. కార్మికుల సమస్యలు, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆపై మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని బ్రాహ్మణి సందర్శించారు. అనంతరం బ్రహ్మణి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట వేశారని తెలిపారు. మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు తీసుకువచ్చారని చెప్పారు. మహిళా సాధికారిత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ నిరంతరం పరితపిస్తారన్నారు.

Chandrababu: ఆడబిడ్డలను ప్రపంచంలోనే శక్తివంతులుగా చేసే బాధ్యత నాది..


ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా స్పీకర్‌గా ప్రతిభాభారతికి అవకాశం ఇచ్చింది చంద్రబాబే అని అన్నారు. ఎంత పెద్ద చదువుకైనా బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణసౌకర్యం కల్పించారన్నారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు పెద్దఎత్తున ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రొఫెషనల్ కోర్సులను ఏర్పాటు చేసి... తద్వారా యువతకు ఉపాధి కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో గత అయిదేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్యుల బతుకు దుర్భరంగా మారిందని నారా బ్రహ్మణి విమర్శలు గుప్పించారు.


ఇవి కూడా చదవండి...

LokSabha Elections: బస్సు బోల్తా: భద్రత సిబ్బందికి గాయాలు

PM Modi: చంద్రబాబు అనుభవజ్ఞుడైన నాయకుడంటూ మోదీ జన్మదిన శుభాకాంక్షలు..

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 20 , 2024 | 04:15 PM

Advertising
Advertising