AP Elections 2024: డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్ గేర్‌లో వెళ్లింది: చంద్రబాబు
ABN, Publish Date - May 01 , 2024 | 06:50 PM
ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు.
చీరాల: ఏపీని సీఎం జగన్ (CM Jagan) మాఫియాల రాజ్యాంగా తయారుచేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆరోపించారు. చీరాలలో జరుగుతున్న ప్రజాగళం భారీ బహిరంగ సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే ప్రజావేదికను కూల్చి పాలన ప్రారంభించారని ధ్వజమెత్తారు.
Janasena: గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు కొంత రిలీఫ్..
పోలీసు వ్యవస్థ ద్వారా ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. జగన్ ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తీసుకువచ్చారని అన్నారు. ఈ సైకో(జగన్)ను ఇంటికి సాగనంపాలని అందరిలో కసి ఉందన్నారు.ప్రజల భూములపై జగన్ పెత్తనం ఏంటి? అని ప్రశ్నించారు. జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు ఫైల్‌పై రెండో సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ దుర్మార్గ పాలనను తుదముట్టించి ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని మాటిచ్చారు.డ్రైవింగ్‌రాని వ్యక్తి పాలనలో ఏపీ రివర్స్ గేర్‌లో వెళ్లిందని విమర్శించారు.టీచర్లను మద్యం దుకాణాల దగ్గర కాపలా పెట్టారని ధ్వజమెత్తారు.
ఏపీని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఫైర్ అయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి అప్పులు వచ్చే పరిస్థితి లేదని.. ఆదాయం తగ్గిందని.. జీతాలు ఇవ్వలేరని అన్నారు. ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే పరిపాలన చేయాలన్నారు. ఇష్టానుసారం జేబ్రాండ్లు పెట్టి ఏపీని అతలాకుతలం చేశారని ఏకిపారేశారు. ఏపీలో 30వేల మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికులు పని దొరక్క ఆత్మహత్య చేసుకున్నారని వాపోయారు. ఏపీని జగన్ నియంతలా పాలించాలనుకున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
Lok Sabha Polls 2024: తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్లిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..
Read Latest AP News And Telugu News
Updated Date - May 01 , 2024 | 07:15 PM