ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics:ఎన్డీఏకు జేపీ మద్దతు.. స్వాగతించిన చంద్రబాబు నాయుడు

ABN, Publish Date - Mar 20 , 2024 | 09:47 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మద్దతు ప్రకటించారు. ఎన్డీఏతో కలిసి పనిచేస్తామని, రాష్ట్రం నుంచి అరాచక పాలనను తరిమికొడతామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమికి జయప్రకాశ్ నారాయణ మద్దతు తెలుపడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayana) మద్దతు ప్రకటించారు. ఎన్డీఏతో (NDA) కలిసి పనిచేస్తామని, రాష్ట్రం నుంచి అరాచక పాలనను తరిమికొడతామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ (TDP), భారతీయ జనతా పార్టీ (BJP), జనసేన (Janasena) పార్టీ కూటమికి జయప్రకాశ్ నారాయణ (Jaya Prakash Narayana) మద్దతు తెలుపడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu) స్వాగతించారు. ప్రగతిశీల, ఆంధ్ర ప్రదేశ్‌‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమాన ఆలోచనలు కలిగిన వ్యక్తులు, సంస్థలు కలిసి రావాలని చంద్రబాబు (Chandrababu) అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.

జేపీ ఏమన్నారంటే..?

‘అరాచక పాలనకు చరమగీతం పాడతాం. అభివృద్ది, సంక్షేమం కోసం పాటుపడే వారికి మద్దుతుగా ఉంటాం. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలకు లోక్ సత్తా అండగా ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతుందని విశ్వసిస్తున్నాం. సంక్షేమం, అభివృద్ది, ఉపాధి, పరిశ్రమలకు అవకాశం కల్పిస్తారనే నమ్మకం ఉంది. అందుకోసమే ఎన్డీఏకు లోక్ సత్తా అండగా నిలువనుంది. తమ పార్టీ నిర్ణయాన్ని ప్రజలు, మేధావులు, రైతులు ఆలోచించాలి. రాష్ట్రానికి మేలు చేసేది ఎవరో గమనించండి. ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపడంతో తనపై విమర్శలు వస్తాయి. తనపై కులం ముద్ర కూడా వేస్తారు. ఎన్డీఏకు మద్దతు అనే తన నిర్ణయం రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసమే తీసుకున్నా అని’ జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 20 , 2024 | 09:47 PM

Advertising
Advertising