ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: యువనేత నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలు

ABN, Publish Date - Apr 18 , 2024 | 04:18 PM

Andhrapradesh: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ తరపున నామినేషన్ దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో ....

TDP Leader Nara Lokesh Nomination

అమరావతి, ఏప్రిల్ 18: మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ (TDP Mangalagiri Candidate Nara Lokesh) తరపున నామినేషన్ (Nomination) దాఖలైంది. గురువారం మంగళగిరిలోని కార్పొరేషన్ కార్యాలయంలో యువనేత తరపున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి రాజకుమారి గనియాకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను నేతలు అందజేశారు. టీడీపీ సమన్వయ కర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయ కర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ నేతృత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి పోతినేని శ్రీనివాసరావు, దామర్ల రాజు, తోట పార్థసారధి, ఆరుద్ర భూలక్ష్మీ, ఆకుల జయసత్య, బొంతు సాంబిరెడ్డి, ఇబ్రహీం, విజయ్ కుమార్, చాగంటి పూర్ణ, జ్యోతిబసు, సంకా బాలాజీ గుప్తా, మైనర్ బాబు, రేఖా సుధాకర్ గౌడ్, ఇట్టా పెంచలయ్య హాజరయ్యారు. మధ్యాహ్నం 2:34 గంటలకు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?


కాగా.. లోకేష్ నామినేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కూటమి నేతలు నిర్ణయించారు. దీంతో ఈరోజు ఉదయం నామినేషన్ పత్రాలతో మంగళగిరి సీతారామకోవెలలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు పూజలు నిర్వహించారు. టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయంలో పూజలు జరిగాయి. నామినేషన్ పత్రాలకు పూజలు చేసి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అలాగే ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిష్టియన్ మత పెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి మధ్యాహ్నం రిటర్నింగ్‌ అధికారికి కూటమి నేతలు నామినేషన్ పత్రాలను అందజేశారు.వేలాదిగా టీడీపీ- జనసేన- బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

YS Sharmila: వైయస్ జగన్ అవసరమా?

Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 04:26 PM

Advertising
Advertising