ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024:వైసీపీ కనుసన్నలో పోలీసులు.. పవన్ సభకు నో పర్మిషన్

ABN, Publish Date - May 10 , 2024 | 09:38 PM

ఏపీలో పోలీసులు ఇంకా వైసీపీ (YSRCP) కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని చీవాట్లు పెట్టినా వారు తీరు మాత్రం మారడం లేదు. పోలింగ్ కు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. అయినా కూడా వైసీపీకి వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆరోపణలు వస్తున్న పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇచ్చి కూటమి అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

Pawan Kalyan

కాకినాడ: ఏపీలో పోలీసులు ఇంకా వైసీపీ (YSRCP) కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఎన్నికల సంఘం ఎన్ని చీవాట్లు పెట్టినా వారి తీరు మాత్రం మారడం లేదు. పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉంది. అయినా కూడా పోలీసులు వైసీపీకి వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఆరోపణలు వస్తున్న పోలీసు అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.

వైసీపీ అభ్యర్థులకు ఎన్నికల ప్రచారానికి అనుమతి ఇచ్చి కూటమి అభ్యర్థులకు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కాకినాడ సిటీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పర్యటనకు ఏపీ పోలీస్ అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదు. 48గంటలుగా జనసైనికులకు, ఎన్డీఏ నేతలకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు.


నిన్నటి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద టీడీపీ, జనసేన నేతల పడిగాపులు కాస్తున్నారు. రేపు(శనివారం) ప్రచారం చివరి రోజు కావడంతో కాకినాడలో పవన్ రోడ్, సభకు టీడీపీ, జనసేన దరఖాస్తు చేసింది. కానీ అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు చెబుతున్నారు.

పవన్ రోడ్డు షో అనుమతి కోసం కాకినాడ నగరంలో ఎక్కడ అనుమతి ఇచ్చినా సమ్మతమేనని కూటమి నేతలు తెలిపారు. కానీ ఎనిమిది ప్రాంతాల్లో దరఖాస్తు చేసినా అధికారులు పర్మిషన్ ఇవ్వడం లేదు. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అధికార దుర్వినియోగంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘానికి కాకినాడ పోలీసులపై కూటమి నేతలు ఫిర్యాదు చేసయనున్నట్లు తెలుస్తోంది.

AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2024 | 10:02 PM

Advertising
Advertising