AP Elections: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. పోలీసుల ఆగ్రహావేశాలు.. ఏం జరిగిందంటే?
ABN, Publish Date - May 07 , 2024 | 04:31 PM
Andhrapradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. మంగళవారం కూడా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓటు వేసేందుకు వస్తున్న పోలీసు సిబ్బందిని అధికారులు వెనక్కి పంపించి వేయడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో రోజుల క్రితం ఫాం 12 డి ఇచ్చినప్పటికీ తమ ఓట్లు ఎందుకు రాలేదని పోలీసు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు.
అమరావతి, మే 7: ఏపీలో పోస్టల్ బ్యాలెట్ (Postal Ballot) ఓటింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. మంగళవారం కూడా పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేసేందుకు వస్తున్న పోలీసు (Police) సిబ్బందిని అధికారులు వెనక్కి పంపించి వేయడంతో పోలీసులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్నో రోజుల క్రితం ఫాం 12 డి ఇచ్చినప్పటికీ తమ ఓట్లు ఎందుకు రాలేదని పోలీసు సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీ(PM Modi) పర్యటన నేపథ్యంలో బందోబస్తు కోసం వెళ్లాలని, తమకు ఓటు వేసే అవకాశం కల్పించాలని ఖాకీలు కోరుతున్నారు.
LokSabha Elections: అఖిలేష్ యాదవ్ ప్రత్యేక పూజలు.. ఆలయాన్ని శుద్ది చేసిన బీజేపీ శ్రేణులు
గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ గందరగోళంగా మారింది. ఉమెన్స్ కాలేజీలో పశ్చిమ నియోజకవర్గం పోస్టల్ బ్యాలెట్ కేంద్రం అధ్వానంగా ఉంది. మంగళగిరి బెటాలియన్‌లో ఒకటే కేంద్రం పెట్టడంతో కానిస్టుబుళ్లు గంటల తరబడి వెయిట్ చేస్తున్న పరిస్థితి. పోలింగ్ బందోబస్తుకు వెళ్లిన కానిస్టేబుళ్ళకు ఓటు హక్కు కల్పించకపోవడంతో పోలీసులు మండిపడుతున్నారు. పోలీసు సిబ్బంది ఓటు వేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడుతుందనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని పోలీసులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి...
Election Commission: ‘రైతుభరోసా’ నిధుల పంపిణీపై ఈసీ ఆంక్షలు
Delhi Liquor Case: కవితకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన కోర్టు
Read Latest AP News And Telugu News
Updated Date - May 07 , 2024 | 05:19 PM